సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ – XII షురూ..

హైదరాబాద్ :
సైబరాబాద్ పోలీసులు కమీషనరేట్లో శనివారం రోజున ఆపరేషన్ స్మైల్ – XII సమీక్షా సమావేశం నిర్వహించామని విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఈ నెల జనవరి 1వ తేదీ నుంచి 30 వరకు ఆపరేషన్ స్మైల్ – XII లో భాగంగా తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, భిక్షాటన, చెత్త సేకరణ, బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, వెట్టి చాకిరీలో చిక్కుకున్న పిల్లలను గుర్తించి, రక్షించి వివిధ శాఖల సమన్వయంతో వారికి పునరావాసం కల్పించడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ఆపరేషన్ కోసం 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ బృందంలోఒక సబ్-ఇన్‌స్పెక్టర్, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు (వీరిలో ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్) ఉంటారన్నారు. తప్పిపోయిన పిల్లలు, వీధి బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులతో కలిపేందుకు “దర్పణ్ యాప్ ” ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తామన్నారు.
