భైంసా లొ అక్రమంగా 362 క్వింటాళ్ల బియ్యం తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత,
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 8: నిర్మల్ జిల్లా భైంసా లో పీడీఎస్ బియ్యం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగేతుతున్నాయి. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసే సన్నగా చేసి అమ్మే వ్యాపార లింకులను నిర్మల్ జిల్లా పోలీసులు చేదించారు. ఏకంగా 362 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. శుక్రవారం రాత్రి సుమారుగా 9 గంట ప్రాంతం లో భైంసా లోని నిర్మల్ ఎక్స్ రోడ్ వద్ద కారు మలుపు తిరుగుతూ ఉండగా మహారాష్ట్ర వైపు నుంచి నిర్మల్ వైపుకు వస్తున్నటువంటి 12 టైర్ల పెద్ద లారీ దాని లోపల ఎక్కువ మొత్తంలో ఉన్న సరుకు తో దానిని ఢీ కొట్టి ఆగిపోవడం జరిగింది. అ కార్ యజమాని బైంసా లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పటం వల్ల జిల్లా ఎస్పీ కి సమాచారం అందించిన భైంసా పోలీస్ సిబ్బంది. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ డాక్టర్.జానకి షర్మిల ఊటా ఉటిన ఒక ప్రత్యేక టీం నీ భైంసా కి పంపటం జరిగింది. ప్రత్యేక టీం ఎస్పి సూచనల మేరకు దానిలో ఉన్న బియ్యాన్ని పరిశీలించి అది పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా చేసినవిగా గుర్తించారు. ఎస్పి సూచనలతో మొత్తం 362 సంచుల్లో ఉన్న 36 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయటం జరిగిందనీ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ జిల్లా నిర్మల్ జిల్లాలో గ్రామాల నుండి పీడీఎస్ రైస్ ని తక్కువ రేటుకు కొని జిల్లాలో వీరి ఆటలు సాగటం లేదు అని మహారాష్ట్ర లో అజ్ఞాత ప్రాంతంలో కొన్ని మిల్లుల్లో ఆ రైస్ని సన్నగా పాలిష్ చేసి తిరిగి కొన్ని బ్రాండ్ల పేరుతో అమ్మటానికి జిల్లాకి తీసుకు వస్తున్నారు. ఇట్టి వారి పైన చట్ట పరంగా కఠిన చర్యలుంటాయని తెలిపారు. ఈ కేసు లొ ఇంకా లోతుగా విచారణ కోసం భైంసా ఏ ఎస్పి అవినాష్ కుమార్ ఐపిఎస్ నీ నియమించి దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుని కేసు చేయటం జరిగిందని తెలిపారు. చక చక్యంగా వ్యవరించిన ప్రత్యేక టీం లో పనిచేసినటువంటి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 8: నిర్మల్ జిల్లా భైంసా లో పీడీఎస్ బియ్యం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగేతుతున్నాయి. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసే సన్నగా చేసి అమ్మే వ్యాపార లింకులను నిర్మల్ జిల్లా పోలీసులు చేదించారు. ఏకంగా 362 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు.
శుక్రవారం రాత్రి సుమారుగా 9 గంట ప్రాంతం లో భైంసా లోని నిర్మల్ ఎక్స్ రోడ్ వద్ద కారు మలుపు తిరుగుతూ ఉండగా మహారాష్ట్ర వైపు నుంచి నిర్మల్ వైపుకు వస్తున్నటువంటి 12 టైర్ల పెద్ద లారీ దాని లోపల ఎక్కువ మొత్తంలో ఉన్న సరుకు తో దానిని ఢీ కొట్టి ఆగిపోవడం జరిగింది. అ కార్ యజమాని బైంసా లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పటం వల్ల జిల్లా ఎస్పీ కి సమాచారం అందించిన భైంసా పోలీస్ సిబ్బంది. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ డాక్టర్.జానకి షర్మిల ఊటా ఉటిన ఒక ప్రత్యేక టీం నీ భైంసా కి పంపటం జరిగింది. ప్రత్యేక టీం ఎస్పి సూచనల మేరకు దానిలో ఉన్న బియ్యాన్ని పరిశీలించి అది పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా చేసినవిగా గుర్తించారు. ఎస్పి సూచనలతో మొత్తం 362 సంచుల్లో ఉన్న 36 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయటం జరిగిందనీ అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ జిల్లా నిర్మల్ జిల్లాలో గ్రామాల నుండి పీడీఎస్ రైస్ ని తక్కువ రేటుకు కొని జిల్లాలో వీరి ఆటలు సాగటం లేదు అని మహారాష్ట్ర లో అజ్ఞాత ప్రాంతంలో కొన్ని మిల్లుల్లో ఆ రైస్ని సన్నగా పాలిష్ చేసి తిరిగి కొన్ని బ్రాండ్ల పేరుతో అమ్మటానికి జిల్లాకి తీసుకు వస్తున్నారు. ఇట్టి వారి పైన చట్ట పరంగా కఠిన చర్యలుంటాయని తెలిపారు.
ఈ కేసు లొ ఇంకా లోతుగా విచారణ కోసం భైంసా ఏ ఎస్పి అవినాష్ కుమార్ ఐపిఎస్ నీ నియమించి దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుని కేసు చేయటం జరిగిందని తెలిపారు. చక చక్యంగా వ్యవరించిన ప్రత్యేక టీం లో పనిచేసినటువంటి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
