ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు భరోసా — మల్‌రెడ్డి రాంరెడ్డి

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు భరోసా — మల్‌రెడ్డి రాంరెడ్డి

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చింతలకుంట ప్రాంతానికి చెందిన కళ్ళకుంట్ల ఫణికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్ ) ద్వారా మంజూరైన రూ.1,00,000/- చెక్కును తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి చైతన్యపురి కాంగ్రెస్ కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాహిత పాలనలో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద భరోసాగా నిలుస్తోందన్నారు.ప్రజల కష్టసుఖాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సహాయం ఫణి వారి కుటుంబానికి ఊరటనిచ్చేలా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

About The Author