జాతీయ రహదారి కడ్తాల్ బైపాస్ రోడ్డు పాత వై జంక్షన్ ద్వారా రోడ్డు రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 05: నిర్మల్ జిల్లా నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చిన కలెక్టర్…సోన్ మండల కేంద్రం, పాక్ పట్ల ,గంజాల్ , మాదాపూర్,నిర్మల్ పట్టణ ప్రజాప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ గారిని కలిసి జాతీయ రహదారి నిర్మల్ బైపాస్ కడ్తాల్ వై జంక్షన్ మీదుగా నిర్మల్ పట్టణానికి వెళ్లే విధంగా రోడ్డు రక్షణ చర్యలు చేపట్టి ప్రయాణం కొనసాగించేలా వీలు కల్పించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సోన్ మండలం కడ్తాల్ సర్వీస్ రోడ్డు నూతనంగా నిర్మాణం చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కడ్తాల్ గ్రామస్తులు 48 రోజులుగా దీక్ష చేపట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వై జంక్షన్ వద్ద నిర్మల్కు వెళ్లకుండా జాతీయ రహదారి నుంచి కొండాపూర్ మీదుగా నిర్మల్ వెళ్లే విధంగా రోడ్డు మళ్లించారు. దీనివల్ల సోన్ మండల కేంద్ర ప్రజలకు మండలంలోని పలు గ్రామాల ప్రజలకే కాకుండా నిర్మల్ పట్టణ ప్రజలకు, నర్సాపూర్ ,కుంటాల, బైంసా, ముధోల్. బాసర,మహారాష్ట్ర, నాందేడ్, పలు మండలాల నుంచి వచ్చే ప్రజలకు దూర భారం, వ్యయ, ప్రయాసలకు గురికావాల్సి వస్తుంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి వైద్య నిమిత్తం వెళ్లడానికి అత్యవసర సమయంలో ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు.ఈ ఇబ్బందులను తొలగించడానికి పాత వై జంక్షన్ ద్వారానే రహదారి మార్గం కొనసాగేలా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ మేరకు జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో సమస్య పరిష్కారం చూపుతానని జిల్లా పాలనాధికారి హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ మాజీ కౌన్సిలర్ రఫీ అహ్మద్ ఖురేష్, గంజాల్ మాజీ సర్పంచ్ లావణ్య నవీన్, మాజీ ఉప సర్పంచ్ గంగయ్య ,సోన్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు లింగవ్వ శ్రీనివాస్, సోన్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు, నిర్మల్ పట్టణ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

జాతీయ రహదారి కడ్తాల్ బైపాస్ రోడ్డు పాత వై జంక్షన్ ద్వారా రోడ్డు రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్  కు వినతి పత్రం

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 05: నిర్మల్ జిల్లా నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చిన కలెక్టర్…సోన్ మండల కేంద్రం, పాక్ పట్ల ,గంజాల్ , మాదాపూర్,నిర్మల్ పట్టణ ప్రజాప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ గారిని కలిసి జాతీయ రహదారి నిర్మల్ బైపాస్ కడ్తాల్ వై జంక్షన్ మీదుగా నిర్మల్ పట్టణానికి వెళ్లే విధంగా రోడ్డు రక్షణ చర్యలు చేపట్టి ప్రయాణం కొనసాగించేలా వీలు కల్పించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
సోన్ మండలం కడ్తాల్ సర్వీస్ రోడ్డు నూతనంగా నిర్మాణం చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కడ్తాల్ గ్రామస్తులు 48 రోజులుగా దీక్ష చేపట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వై జంక్షన్ వద్ద నిర్మల్కు వెళ్లకుండా జాతీయ రహదారి నుంచి కొండాపూర్ మీదుగా నిర్మల్ వెళ్లే విధంగా రోడ్డు మళ్లించారు. దీనివల్ల సోన్ మండల కేంద్ర ప్రజలకు మండలంలోని పలు గ్రామాల ప్రజలకే కాకుండా నిర్మల్ పట్టణ ప్రజలకు, నర్సాపూర్ ,కుంటాల, బైంసా, ముధోల్. బాసర,మహారాష్ట్ర, నాందేడ్, పలు మండలాల నుంచి వచ్చే ప్రజలకు దూర భారం, వ్యయ, ప్రయాసలకు గురికావాల్సి వస్తుంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి వైద్య నిమిత్తం వెళ్లడానికి అత్యవసర సమయంలో ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు.ఈ ఇబ్బందులను తొలగించడానికి పాత వై జంక్షన్ ద్వారానే రహదారి మార్గం కొనసాగేలా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ మేరకు జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో సమస్య పరిష్కారం చూపుతానని జిల్లా పాలనాధికారి హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ మాజీ కౌన్సిలర్ రఫీ అహ్మద్ ఖురేష్, గంజాల్ మాజీ సర్పంచ్ లావణ్య నవీన్, మాజీ ఉప సర్పంచ్ గంగయ్య ,సోన్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు లింగవ్వ శ్రీనివాస్, సోన్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు, నిర్మల్ పట్టణ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author