గీతంలో సంక్రాంతి సంబరాలు

- సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంగారెడ్డి:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి సంబరాలను ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించారు. మన దేశ గొప్ప వ్యవసాయ వారసత్వాన్ని ఈ వేడుకలు ప్రతిబింబించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల సంక్రాంతి సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించాయి. మొత్తంమీద పంటల వేడుక యొక్క రంగులు, సంప్రదాయాలు పండుగ స్పూర్తిని సజీవంగా నిలిపాయి.పలు విభాగాల విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఐక్యత, సామరస్యాన్ని సూచిస్తూ భోగి మంటలను వెలిగించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గొబ్బెమ్మలతో అలంకరించిన సాంప్రదాయ రంగోలి (ముగ్గు) డిజైన్లు, గాలిపటాలు ఎగురవేయడం, సంప్రదాయ దుస్తులలో విద్యార్థులు చేసిన ఆకర్షణీయమైన జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ప్రాంగణమంతా ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదేశంగా మారింది.ఈ వేడుకలలో ముఖ్యాంశాలలో ఒకటి, వ్యవసాయంలో రైతుకు అండదండలుగా నిలిచే పశువుల పట్ల కృతజ్జతను సూచించే తెలుగు రాష్ట్రాల విలక్షణమైన సంక్రాంతి ఆచారమైన సాంప్రదాయ గంగిరెద్దులు, పండుగ శోభను మరింత ఇనుమడింపజేశాయి. నేటి యువతకు పురాతన పంటల సంప్రదాయాలను పరిచయం చేయడానికి గాను ఎడ్ల బండి సవారీలు కూడా నిర్వహించారు.WhatsApp Image 2026-01-08 at 15.46.25

అరటి ఆకులపై వడ్డించే సాంప్రదాయ బంతి భోజనం, దీనికి అదనంగా చెరుకు రసం ఈ వేడుకలలో కీలక ఆకర్షణగా నిలిచాయి. గీతంలోని ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్.. ఇలా అన్ని విభాగాల విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొని, పండుగ అనుభవాన్ని మరుపురాని జ్జాపకంగా పదిలం చేసుకున్నారు.తెలుగు సంస్కృతి సారాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఉల్లాసభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రాంగణ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చాయి.సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి, సమగ్ర ప్రాంగణ వాతావరణాన్ని ప్రోత్సహించడంలో గీతం యొక్క నిబద్ధతను ఈ వేడుకలు పునరుద్ఘాటించాయి. ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ పర్యవేక్షణలో, విద్యార్థి క్లబ్ అన్వేషణ ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించింది.

About The Author