వనమహోత్సవంలో పచ్చదనం పెంపొందేలా మొక్కలు నాటాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 04: వనమహోత్సవంలో పచ్చదనం పెంపొందేలా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వన మహోత్సవం-2025, కార్యక్రమ కార్యచరణ పై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పచ్చదనం పెంపొందేలా లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా లక్ష్యం 69 లక్షల 55వేల 300 మొక్కలు నాటే ప్రణాళికలను రూపొందించడం జరిగిందని తెలిపారు. శాఖల వారీగా వనంహోత్సవ లక్ష్యాల కార్యాచరణలను ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వసతిగృహాలు, దేవాలయాలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, నీటిపారుదల, అటవీ, భూములు వంటి ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీల్లో మొక్కలు నాటేందుకు అనువైన ఖాళీ స్థలాలను గుర్తించాలని సూచించారు. అటవీ, పంచాయతీ, డి ఆర్ డి ఓల ఆధ్వర్యంలో నర్సరీలలో అవసరమైన మొక్కలను పెంచాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా అటవీ శాఖ అధికారి నాగిని భాను, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 04: వనమహోత్సవంలో పచ్చదనం పెంపొందేలా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వన మహోత్సవం-2025, కార్యక్రమ కార్యచరణ పై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పచ్చదనం పెంపొందేలా లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా లక్ష్యం 69 లక్షల 55వేల 300 మొక్కలు నాటే ప్రణాళికలను రూపొందించడం జరిగిందని తెలిపారు. శాఖల వారీగా వనంహోత్సవ లక్ష్యాల కార్యాచరణలను ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వసతిగృహాలు, దేవాలయాలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, నీటిపారుదల, అటవీ, భూములు వంటి ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీలు,
మేజర్ పంచాయతీల్లో మొక్కలు నాటేందుకు అనువైన ఖాళీ స్థలాలను గుర్తించాలని సూచించారు. అటవీ, పంచాయతీ, డి ఆర్ డి ఓల ఆధ్వర్యంలో నర్సరీలలో అవసరమైన మొక్కలను పెంచాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా అటవీ శాఖ అధికారి నాగిని భాను, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
