ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామానికి అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి మారుతి రాజన్న

WhatsApp Image 2025-12-11 at 4.57.12 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : 

కుబీర్ మండలలోని.ధర్ కుబీర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న తోకల మారుతి రాజన్న  విలేకరులతో మాట్లాడుతూ.కుబీర్ మండలానికి 2కిమి. దూరము లో ఉన్న అభివృద్ధిలో చాలా వెనుకబాటుకుగురైన గ్రామము ఇది గ్రామానికి అన్నివిధాల అభివృద్ధి చేస్తా అని అన్నారు.ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యేలా కృషిచేస్తానని మరియు ఉపాధి హామీ ద్వారా 100 రోజుల పని ప్రతి కుటుంబానికి కల్పించేలా కృషి చేస్తా అని అన్నారు.వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేందుకు ఉపాధి హామీ నిధుల ద్వారా మట్టి రోడ్ల  వేయించే బాధ్యత మరియు గ్రామంలో 70 వరకు మరుగుదొడ్ల నిర్మాణం అయిన వాటి బిల్లుల మంజూరు అయ్యేలా కృషిచేస్తా అన్నారు..అసంపూర్తిగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే ద్వారా ప్రత్యెక అభివృద్ధి నిధులు రాబట్టడానికి కృషి చేస్తా.గ్రామము నుండి బ్రహ్మేశ్వర వరకు బిటి రోడ్డు నిర్మాణం కోరకు నిధుల మంజూరుకు ఎమ్మెల్యే  సహాయం కోరి బిటి రోడ్డు వేయించే విధంగా కృషి చేస్తా అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల  ద్వారా అమలయ్యే ప్రతి సంక్షేమ  పథకం గ్రామ ప్రజలకు అందించే విధంగా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ భవనం. మంజూరు అయ్యేలా కృషి చేసి రెంట్ బిల్డింగ్ లో అంగన్ వాడి బడి.అంగన్ వాడి భవనం నిర్మించడానికి తను వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

స్మశాన వాటికకు కల్వర్ట్ నిర్మాణం చేయిస్తా అని హామీ ఇచ్చారు . గ్రామ ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన అన్నారు. 

About The Author