సీఎం పర్యటనకు క్షేత్ర స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్,జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామం లోని సదర్మట్ బ్యారేజి ప్రారంభోత్సవ కార్యక్రమానికి *రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి. విచ్చేయనున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల కలిసి భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో పాటు, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ , నీటి పారుదల శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
