నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

కరీంనగర్ :

WhatsApp Image 2025-09-18 at 6.19.18 PM

సైబర్ క్రైమ్  డిఎస్పి కోత్వాల్ రమేష్ సూచనల మేరకు, కరీంనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ అనిల్ మాట్లాడుతూ విద్యార్థులు అధ్యాపక బృందానికి వివిధ సైబర్ మోసాలపై విపులమైన అవగాహన కల్పించారు. 

Read More పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి. సురేష్

APK Files ద్వారా జరిగే మోసాలు.. Phishing Messages,  Links.. Part-time Job Scams.. Investment Frauds.. Social Media Frauds.. Digital Arrest.. Trading Frauds ఉంటాయన్నారు.

Read More లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

సైబర్ నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, తాము మాత్రమే కాకుండా ఇతరులను కూడా అవగాహన పరచాలని సూచించారు. ఈ సదస్సులో 300 కు పైగా విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల విద్యార్థులు, కళాశాల బృందం సంతోషం వ్యక్తం చేయడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో 
పోలీసులు సంజీవ్, అరుణ్, మాధవి, రవి, వసీం అక్రమ్ పాల్గొన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయవచ్చని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా మీ ప్రాంతం లేదా విద్యాసంస్థలో సైబర్ అవగాహన కార్యక్రమం కావాలనుకుంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ కు నేరుగా సంప్రదించవచ్చని లేదా +91 87126 65866 నంబర్‌కు కాల్ చేయవచ్చని సూచించారు.

Read More రసాయన శాస్త్రంలో పనస మహేష్ కు పీహెచ్డీ

About The Author