సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందేజేసిన ఏఐవైఎఫ్ నాయకులు
కరీంనగర్, జనవరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ విభాగం యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి వినతి పత్రం అందేశారు. సోమవారం కేంద్రంలోని ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేసిన అనంతరం యుగంధర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ, క్రిటికల్ కేర్ వైద్యం లేకపోవడం మూలంగా రోగులు అత్యవసర సమయంలో చికిత్స కోసం వస్తున్న ప్రజలకు సరైన వైద్యం లేకపోవడంతో హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు వెళ్ళడం జరుగుతుందన్నారు. క్రిటికల్ పొజిషన్లో వాహనాల్లో వెళుతున్న సందర్భంలో చాలామంది చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని, ఉమ్మడి జిల్లాకు ప్రధాన కేంద్రమైన కరీంనగర్ లో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ వైద్య సౌకర్యం అందించేందుకు యుద్ద ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణకి తలమానికంగా ఉన్న కరీంనగర్లో క్రిటికల్ కేర్ వైద్య లేకపోవడం మూలంగా ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఆయన వెంట నగర కార్యదర్శి చెంచాల మురళి తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్, జనవరి
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ విభాగం యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి వినతి పత్రం అందేశారు. సోమవారం కేంద్రంలోని ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేసిన అనంతరం యుగంధర్ మాట్లాడుతూ
ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ, క్రిటికల్ కేర్ వైద్యం లేకపోవడం మూలంగా రోగులు అత్యవసర సమయంలో చికిత్స కోసం వస్తున్న ప్రజలకు సరైన వైద్యం లేకపోవడంతో హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు వెళ్ళడం జరుగుతుందన్నారు. క్రిటికల్ పొజిషన్లో వాహనాల్లో వెళుతున్న సందర్భంలో చాలామంది చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని, ఉమ్మడి జిల్లాకు ప్రధాన కేంద్రమైన కరీంనగర్ లో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ వైద్య సౌకర్యం అందించేందుకు యుద్ద ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణకి తలమానికంగా ఉన్న కరీంనగర్లో క్రిటికల్ కేర్ వైద్య లేకపోవడం మూలంగా ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఆయన వెంట నగర కార్యదర్శి చెంచాల మురళి తదితరులు పాల్గొన్నారు.
