దేవుని గుట్టను సందర్శించిన అటవీశాఖ ముఖ్య కన్సర్వేటర్అధికారి సువర్ణ

ములుగు జిల్లా ప్రతినిధి :
ములుగు జిల్లా అటవీ ప్రాంతం లోని (కొత్తూరు) దేవుని గుట్ట ను శుక్రవారం అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ అధికారి సిహెచ్. సువర్ణ తనిఖీలో భాగంగా అక్కడ ఉన్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు ఆమె తగు సూచనలు చేశారు. అనంతరం శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. తదుపరి ఇంచెర్ల ఈకో పార్కును సందర్శించి, అక్కడ చేపట్టిన టవర్, నీటి కుంటలు, పచ్చి వెదురు బొమ్మలు ఆదితర పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాలేశ్వరం సిసిఎఫ్ బి. ప్రభాకర్, ములుగు జిల్లా ఆట విశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, భూపాలపల్లి జిల్లా ఆటవిశాఖ అధికారి నవీన్ రెడ్డి, ములుగు డివిజనల్ అధికారులు ఎఫ్ ఆర్ ఓ లు, ఎఫ్ బి ఓ లు తదితరులు పాల్గొన్నారు.
About The Author
03 Mar 2026
