
ఖమ్మం ప్రతినిది :
షైన్ హై స్కూల్ మానేజ్మెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరొక్కసారి వారి విశాల హృదయాన్ని, సహాయక తత్వాన్ని చాటుకున్నారు... కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధరణ ఫౌండేషన్ లో వున్న వృద్దులకు, మతిస్థిమితం లేని వారికి షైన్ స్కూల్ మేనేజ్మెంట్ బియ్యం, నూనె,టిఫిన్ సామాగ్రి,కూరగాయలు, పండ్లు,వంటి నిత్యావసర వస్తువులు అందించారు...ఈ సందర్భంగా కరెస్పాండంట్ అన్సార్ పాషా మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన తల్లిదండ్రులకి ధన్యవాదములు తెలిపారు...ఆదరణ ఫౌండేషన్ నడుపుతున్న నిస్సిని అభినందించారు... ఈ కార్యక్రమం లో కరెస్పాండంట్ అన్సార్ పాషా,డైరెక్టర్ లాల్ మహమ్మద్, ప్రిన్సిపాల్ శ్వేత,అడ్మినిస్ట్రేషన్ నాగేశ్వరావు, ముస్తఫా, పాల్గొన్నారు...