పోలీస్ సిబ్బందికి...వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం
ఎల్బీనగర్:
మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ లోని పోలీసు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ లోని పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండడానికి, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా గుర్తించి చికిత్స చేయించుకోవడానికి మల్కాజిగిరి సిపి అవినాష్ మహంతి ఆదేశానుసారం ఒమేగా హాస్పిటల్, ఫోర్ట్ డెంటల్, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు.
సోమవారం ఎల్బీనగర్ సిపి క్యాంపు ఆఫీస్ లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.
ఈ హెల్త్ క్యాంపు నందు కింద పేర్కొన్న పలు ఆరోగ్య పరీక్షలు చేయబడినాయి.లిపిడ్ ప్రొఫైల్
బీఎండీ ( బోన్ మినరల్ డేన్సిటీ
ఆర్బీఎస్, బీపీ, ఈసీజీ, 2డిఇకో,
పిఎస్ఏ (ప్రొస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్ ) 45 ఏళ్ల వయస్సు పైబడిన పురుషులకు పిఏపి స్మెర్ (40 ఏళ్ళు పైబడిన మహిళలకు) మమ్మోగ్రామ్ (40 ఏళ్ళు పైబడిన మహిళలకు) ఈ హెల్త్ క్యాంపులో ఫోర్డ్ డెంటల్ వారిచే దంత సంబంధ పరీక్షలు, అగర్వాల్ ఐ హాస్పిటల్ వారిచే కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ క్యాంపులో ఎముకల,జనరల్ డాక్టర్లు పాల్గొన్నారు.మహిళ సిబ్బందికి ముందస్తుగా క్యాన్సర్ రాకుండా ఉండే చికిత్సలు చెకప్ లు నిర్వహించడం జరుగుతుంది. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఈ క్యాంపు రేపు కూడా కొనసాగుతుంది
