పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది..

హైదరాబాద్ :

- వెల్లడించిన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఐపీఎస్
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన కమిషనర్

 

Read More కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే కాళేశ్వరంపై కుట్రలు

WhatsApp Image 2025-08-30 at 6.18.01 PM

Read More తాడ్వాయి మండల కేంద్రంలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ ఈ రోజు పదవీ విరమణ పొందిన నందు కుమార్, డీ.ఎస్.పీ. ఫింగర్ ప్రింట్ బ్యూరో,  అనంతయ్య, సబ్ ఇన్స్పెక్టర్, కంట్రోల్ రూమ్, మేఘమాల, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, బాలాపూర్ పోలీస్ స్టేషన్, సుబ్బా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, సిఏఆర్ అంబర్పేట లకు సీపీ సుధీర్ బాబు రాచకొండ పోలీస్ కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది. 

Read More నేటి భారతం :

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..  పోలీసు ఉద్యోగం  ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు వారిని  అభినందించారు. పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్, ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదవీ విరమణ పొందే అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేసిన పెన్షన్ డెస్క్ ద్వారా త్వరగా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. 

Read More గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ అది

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, సీసీఆర్బీ ఏసిపి రమేష్, సీఈఓ అడ్మిన్ పుష్పరాజ్, ఏఏఓ అశోక్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, కో ఆపరేటివ్ డైరెక్టర్ టేకుల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Read More ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి..

 

About The Author