తెలంగాణ లో బలంగా వీస్తున్న మార్పు గాలులు
తెలంగాణ లో బలంగా వీస్తున్న మార్పు గాలులు సహజంగా చాలా మంది కారును పదేళ్లకు ఒకసారి..లక్ష కిలోమీటర్లు దాటిన తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే తెలంగాణాలో కూడా రాజకీయ మార్పుతథ్యం అనేలా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఓటర్ల మదిలో ఉన్న ప్రధాన ఆలోచన రెండు సార్లు బిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చాం. ఈ సారి కాంగ్రెస్ కు అవకాశం ఇద్దాం అనే మూడ్ లోకి వచ్చినట్లు క్షేత్ర స్థాయి పరిస్థితులు తేల్చిచెపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ నే భావిస్తున్నారు. దీనికి తోడు ఆ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు కూడా ప్రజల్లోకి బలంగానే వెళ్లాయి. కారణాలు ఏమైనా ఈ సారి ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు పదే పదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కటిక చీకట్లు వస్తాయని..రైతులకు మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తారని ప్రచారం చేస్తున్నా ప్రజలు..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకునే సూచనలు కనిపించటం లేదు. ఎందుకంటే చాలా మంది ప్రజలు ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఈ సారి ఒక ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. కెసిఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ధరణి అంశం కూడా అధికార బిఆర్ఎస్ కు పెద్ద మైనస్ గా మారబోతున్నట్లు చెపుతున్నారు. ఎవరు ఏమి చేస్తున్నారో ఏ మాత్రం పట్టించుకునే అవకాశం లేని హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో జరిగిన భూ మోసాల గురించి ప్రజలకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. కానీ జిల్లాల్లో ఎమ్మెల్యేలు…వారి అనుచరులు చేసిన వ్యవహారాలు దాచినా ఏ మాత్రం దాగవు. ధరణి పేరుతో చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యవహారాలు బహిర్గతం అయ్యాయని చెపుతున్నారు. – కెసిఆర్ ఎందుకు అంత కష్టపడుతున్నట్లు దీంతో పాటు వరసగా మూడవసారి ఎమ్మెల్యేలను మార్చకుండా కెసిఆర్ చేసిన ప్రయోగం పెద్ద ఎత్తున బిఆర్ఎస్ ను దెబ్బ కొట్టబోతున్నట్లు కనిపిస్తోంది. వీటితో పాటు ఏ పథకాలు గురించి అయితే కెసిఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారో… తాను తప్ప దేశంలో వీటి గురించి ఆలోచించింది ఎవరూ లేరు అని ప్రకటించుకుంటున్నారో వాటి అమలు అంతంత మాత్రం ఉండటం కూడా బిఆర్ఎస్ ను ముంచబోతున్న అంశంగా పార్టీ నాయకులు కూడా చెపుతున్నారు. ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళిత బంధు వంటి స్కీములు బిఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని ప్రచారంలో ఉన్న ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాలే కాకుండా బిఆర్ఎస్ కు మంచి పట్టు ఉన్న జిల్లాలు అయిన కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కూడా కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో బోరు కొచ్చిన కారు ను ఇంటికి పంపటానికే ప్రజలు సిద్ధం అయినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీ తో గెలిచినా కూడా ఆ క్రెడిట్ లో అరవై శాతం వరకు బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ కే ఇవ్వాల్సి ఉంటుంది అని ..కాంగ్రెస్ కృషి నలభై శాతం మాత్రమే లెక్కించాల్సి ఉంటుంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్పు గాలి చాలా చాలా స్పష్టంగా ఉంది అని తేలిపోతోంది. ఈ లెక్కన డిసెంబర్ మూడున వెలువడే ఫలితాల్లో ఇంకెన్ని సంచలన అంశాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే. మరో కీలకమైన విషయం ఏమిటి అంటే కెసిఆర్ క్యాబినెట్ లోని కీలక మంత్రులు ఇంటి బాట పెట్టబోతున్నారు. హెలికాప్టర్ లో కెసిఆర్ ఎంత స్పీడ్ గా తిరుగుతున్నా కింద మాత్రం కారు పెద్దగా కదలటం లేదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. కారు బోర్ కొచ్చింది..ఇక షెడ్డుకే! కెసిఆర్ ఎందుకు అంత కష్టపడుతున్నట్లు అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కెసిఆర్ చాలా కాలం ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అంటే అయన ప్రగతి భవన్ లో ఉన్నారా…లేక ఫార్మ్ హౌస్ లో ఉన్నారా అనే విషయం ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారికి తప్ప బయట ప్రజలకు తెలిసేది కాదు. లేదంటే అయన ఏమి చేశారో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తే ప్రజలు..పార్టీ నాయకులు కూడా ఓహో కెసిఆర్ ఇది చేశారా అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయనది అంతా రహస్య పాలనే. అయన సచివాలయానికి వచ్చేవారు కాదు…ప్రజలను కలిసే ఛాన్స్ ఎలాగూ లేదు. కెసిఆర్ చేసినట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదు అనే చెప్పొచ్చు. కానీ ఎన్నికల వేళ బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అయన రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలలో హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు…సభల్లో ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కెసిఆర్ ప్రచారం చేస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారు కూడా. కానీ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కెసిఆర్ ఇలా వరసగా ఎప్పుడూ ప్రభుత్వ పరిపాలన కేంద్రం అయిన సచివాలయానికి వచ్చింది లేదు…సమీక్షలు నిర్వహించింది లేదు. రాష్ట్ర ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న సమయంలో కూడా అదే పరిస్థితి. ఎక్కడ వరకో ఎందుకు రాజధాని నగరంలో కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు…వరదలు ముంచెత్తిన సమయంలో కూడా సీఎం కెసిఆర్ బయటకు వచ్చి ప్రజలను పరామర్శించిన సందర్భం లేదు. రాష్ట్రంలోని కొండగట్టు వద్ద అత్యంత ఘోర ప్రమాదం జరిగి దగ్గర దగ్గర 57 మంది వరకు మరణించినా కూడా సీఎం కెసిఆర్ అటు వైపు చూడలేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా కెసిఆర్ ఏ మాత్రం పట్టించుకోలేదు తప్ప బయటకు వచ్చి వాళ్ళను పరామర్శించిన దాఖలాలు లేవు. చెప్పుకుంటే పోతే ఇలాంటి విషయాలు ఎన్నో. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మాత్రం ఇంచు మించు ప్రతి రోజు బయటకు వచ్చి రోజుకు నాలుగు ఎన్నికల మీటింగ్ ల్లో పాల్గొంటున్నారు. ఇది అంతా చూస్తే సీఎం కెసిఆర్ తన అవసరం కోసం…అంటే వచ్చే ఎన్నికల్లో గెలవటం కోసం ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు తప్ప మరొకటి కాదు అనే చర్చ అన్ని వర్గాల్లో సాగుతుంది. చాలా సార్లు సీఎం కెసిఆర్ ప్రజలను ఎందుకు కలవరు అనే ప్రశ్నకు అసలు సీఎం తో ప్రజలకు పని ఏమి ఉంటది అంటూ మంత్రి కేటీఆర్ కొత్త కొత్త వాదనలు తెరపైకి తెస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు సమస్యలు చెప్పుకోవటానికి సీఎం దగ్గరకు వచ్చారు అంటే అది వ్యవస్థ వైఫల్యమే అంటూ సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో కూడా కేటీఆర్ ఇదే లాజిక్ ను అప్లై చేయవచ్చు కదా. సీఎం దగ్గరకు పోకుండానే మీ సమస్యలు అన్ని తీర్చేశాం అని మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే ప్రచారం చేస్తే సరిపోయేది కదా…కెసిఆర్ ఎందుకు ఇంతగా కష్టపడుతున్నట్లు ఎన్నికల కోసం.తొలి టర్మ్ లో అయినా…ఇప్పుడు అయినా కెసిఆర్ ఇంతగా బయటకు వచ్చింది కేవలం ఎన్నికల ప్రచారం కోసమే తప్ప…ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాదు..వారికీ సమస్యలు వచ్చినప్పుడు కాదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కెసిఆర్ ఎందుకు అంత కష్టపడుతున్నట్లు కే టీ ఆర్ కోసం మోడీ ఆశీస్సులు కోరింది నిజమే బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత సీఎం హామీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు అని కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కెసిఆర్ ఇండియా టుడే కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కెసిఆర్ కు ఇదే ప్రశ్న ఎదురైతే అయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది అనే చెప్పాలి. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మాకు కేవలం 63 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ సమయంలో కొత్త రాష్ట్రాన్ని వేరే వాళ్ళు నడిపించటం కష్టం అని సలహా ఇచ్చారు. అవును..దళిత ముఖ్యమంత్రి విషయంలో నేను హామీ ఇచ్చాను. ఇచ్చిన మాటపై మేం వెనక్కి తగ్గలేదు. దానికి సమయం రానివ్వండి అంటూ కెసిఆర్ వ్యాఖ్యానించటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఇదే ఇంటర్వ్యూ లో కెసిఆర్ ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ బహిర్గతం చేసిన సంచలన విషయాలపై కూడా స్పందించారు. ఎన్ డీఏ లో చేరాల్సిందిగా మోడీ కోరితే…ముందు తెలంగాణ కు ఏదైనా మేలు చేయాలని..తర్వాత చూద్దాం అని చెప్పినట్లు వెల్లడించారు. అదే సమయంలో కెటిఆర్ ను సీఎం చేసే విషయంలో జరిగిన మాటల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కెసిఆర్ స్పందిస్తూ ‘50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నందున 70 ఏళ్లు వచ్చే సరికి రిటైర్మెంట్ గురించి ఆలోచించవచ్చని ప్రైవేట్‌గా మాట్లాడితే, దాన్ని ప్రజలకు వెల్లడించాలా? కేటీఆర్ గురించి మోడీ నే ఆరా తీశారు.ఆ సమయంలోనే మీరు ప్రధానమంత్రి అయినందున, మీ ఆశీస్సులు అందజేయండి, అతనికి సహకరించండి అని మోడీ ని కోరాను. ఇలాంటి వ్యక్తిగత సంభాషణలను రాజకీయ వేదికపై వెల్లడించడం ప్రధానికి తగునా? అంటూ మోడీ తీరును కెసిఆర్ తప్పుపట్టారు. నిజమాబాద్ సభలో మోడీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపగా కెసిఆర్ తనయుడు…మంత్రి కేటీఆర్ ఇది అంతా తప్పు…తాను సీఎం కావటానికి….మోడీ అనుమతి అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు స్వయంగా కెసిఅర్ ఈ విషయాలు నిజం అని చెప్పటంతో వీళ్ళు ఏ విషయంలో కూడా నిజం చెప్పరేమో అనే అనుమానాలు రావటం సహజం. ఈ ఇంటర్వ్యూ లో కెసిఆర్ కేంద్రంలోని కేంద్రంలో మోడీ పాలన వంద శాతం దారుణంగా ఉంది అని ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ లో బలంగా వీస్తున్న మార్పు గాలులు సహజంగా చాలా మంది కారును పదేళ్లకు ఒకసారి..లక్ష కిలోమీటర్లు దాటిన తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే తెలంగాణాలో కూడా రాజకీయ మార్పుతథ్యం అనేలా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఓటర్ల మదిలో ఉన్న ప్రధాన ఆలోచన రెండు సార్లు బిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చాం. ఈ సారి కాంగ్రెస్ కు అవకాశం ఇద్దాం అనే మూడ్ లోకి వచ్చినట్లు క్షేత్ర స్థాయి పరిస్థితులు తేల్చిచెపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ నే భావిస్తున్నారు. దీనికి తోడు ఆ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు కూడా ప్రజల్లోకి బలంగానే వెళ్లాయి. కారణాలు ఏమైనా ఈ సారి ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు పదే పదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కటిక చీకట్లు వస్తాయని..రైతులకు మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తారని ప్రచారం చేస్తున్నా ప్రజలు..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకునే సూచనలు కనిపించటం లేదు. ఎందుకంటే చాలా మంది ప్రజలు ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఈ సారి ఒక ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. కెసిఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ధరణి అంశం కూడా అధికార బిఆర్ఎస్ కు పెద్ద మైనస్ గా మారబోతున్నట్లు చెపుతున్నారు. ఎవరు ఏమి చేస్తున్నారో ఏ మాత్రం పట్టించుకునే అవకాశం లేని హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో జరిగిన భూ మోసాల గురించి ప్రజలకు పెద్దగా తెలిసే అవకాశం లేదు.
కానీ జిల్లాల్లో ఎమ్మెల్యేలు…వారి అనుచరులు చేసిన వ్యవహారాలు దాచినా ఏ మాత్రం దాగవు. ధరణి పేరుతో చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యవహారాలు బహిర్గతం అయ్యాయని చెపుతున్నారు. – కెసిఆర్ ఎందుకు అంత కష్టపడుతున్నట్లు దీంతో పాటు వరసగా మూడవసారి ఎమ్మెల్యేలను మార్చకుండా కెసిఆర్ చేసిన ప్రయోగం పెద్ద ఎత్తున బిఆర్ఎస్ ను దెబ్బ కొట్టబోతున్నట్లు కనిపిస్తోంది. వీటితో పాటు ఏ పథకాలు గురించి అయితే కెసిఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారో… తాను తప్ప దేశంలో వీటి గురించి ఆలోచించింది ఎవరూ లేరు అని ప్రకటించుకుంటున్నారో వాటి అమలు అంతంత మాత్రం ఉండటం కూడా బిఆర్ఎస్ ను ముంచబోతున్న అంశంగా పార్టీ నాయకులు కూడా చెపుతున్నారు. ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళిత బంధు వంటి స్కీములు బిఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని ప్రచారంలో ఉన్న ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాలే కాకుండా బిఆర్ఎస్ కు మంచి పట్టు ఉన్న జిల్లాలు అయిన కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కూడా కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో బోరు కొచ్చిన కారు ను ఇంటికి పంపటానికే ప్రజలు సిద్ధం అయినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీ తో గెలిచినా కూడా ఆ క్రెడిట్ లో అరవై శాతం వరకు బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ కే ఇవ్వాల్సి ఉంటుంది అని
..కాంగ్రెస్ కృషి నలభై శాతం మాత్రమే లెక్కించాల్సి ఉంటుంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్పు గాలి చాలా చాలా స్పష్టంగా ఉంది అని తేలిపోతోంది. ఈ లెక్కన డిసెంబర్ మూడున వెలువడే ఫలితాల్లో ఇంకెన్ని సంచలన అంశాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే. మరో కీలకమైన విషయం ఏమిటి అంటే కెసిఆర్ క్యాబినెట్ లోని కీలక మంత్రులు ఇంటి బాట పెట్టబోతున్నారు. హెలికాప్టర్ లో కెసిఆర్ ఎంత స్పీడ్ గా తిరుగుతున్నా కింద మాత్రం కారు పెద్దగా కదలటం లేదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. కారు బోర్ కొచ్చింది..ఇక షెడ్డుకే! కెసిఆర్ ఎందుకు అంత కష్టపడుతున్నట్లు అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కెసిఆర్ చాలా కాలం ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అంటే అయన ప్రగతి భవన్ లో ఉన్నారా…లేక ఫార్మ్ హౌస్ లో ఉన్నారా అనే విషయం ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారికి తప్ప బయట ప్రజలకు తెలిసేది కాదు. లేదంటే అయన ఏమి చేశారో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తే ప్రజలు..పార్టీ నాయకులు కూడా ఓహో కెసిఆర్ ఇది చేశారా అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయనది అంతా రహస్య పాలనే. అయన సచివాలయానికి వచ్చేవారు కాదు…ప్రజలను కలిసే ఛాన్స్ ఎలాగూ లేదు. కెసిఆర్ చేసినట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదు అనే చెప్పొచ్చు. కానీ ఎన్నికల వేళ బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అయన రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలలో హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు…సభల్లో ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కెసిఆర్ ప్రచారం చేస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారు కూడా. కానీ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కెసిఆర్ ఇలా వరసగా ఎప్పుడూ ప్రభుత్వ పరిపాలన కేంద్రం అయిన సచివాలయానికి వచ్చింది లేదు…సమీక్షలు నిర్వహించింది లేదు. రాష్ట్ర ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న సమయంలో కూడా అదే పరిస్థితి. ఎక్కడ వరకో ఎందుకు రాజధాని నగరంలో కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు…వరదలు ముంచెత్తిన సమయంలో కూడా సీఎం కెసిఆర్ బయటకు వచ్చి ప్రజలను పరామర్శించిన సందర్భం లేదు.
కెసిఆర్ ఎందుకు అంత కష్టపడుతున్నట్లు కే టీ ఆర్ కోసం మోడీ ఆశీస్సులు కోరింది నిజమే బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత సీఎం హామీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు అని కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కెసిఆర్ ఇండియా టుడే కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కెసిఆర్ కు ఇదే ప్రశ్న ఎదురైతే అయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది అనే చెప్పాలి. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మాకు కేవలం 63 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ సమయంలో కొత్త రాష్ట్రాన్ని వేరే వాళ్ళు నడిపించటం కష్టం అని సలహా ఇచ్చారు. అవును..దళిత ముఖ్యమంత్రి విషయంలో నేను హామీ ఇచ్చాను. ఇచ్చిన మాటపై మేం వెనక్కి తగ్గలేదు. దానికి సమయం రానివ్వండి అంటూ కెసిఆర్ వ్యాఖ్యానించటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఇదే ఇంటర్వ్యూ లో కెసిఆర్ ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ బహిర్గతం చేసిన సంచలన విషయాలపై కూడా స్పందించారు. ఎన్ డీఏ లో చేరాల్సిందిగా మోడీ కోరితే…ముందు తెలంగాణ కు ఏదైనా మేలు చేయాలని..తర్వాత చూద్దాం అని చెప్పినట్లు వెల్లడించారు. అదే సమయంలో కెటిఆర్ ను సీఎం చేసే విషయంలో జరిగిన మాటల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కెసిఆర్ స్పందిస్తూ ‘50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నందున 70 ఏళ్లు వచ్చే సరికి రిటైర్మెంట్ గురించి ఆలోచించవచ్చని ప్రైవేట్‌గా మాట్లాడితే, దాన్ని ప్రజలకు వెల్లడించాలా? కేటీఆర్ గురించి మోడీ నే ఆరా తీశారు.ఆ సమయంలోనే మీరు ప్రధానమంత్రి అయినందున, మీ ఆశీస్సులు అందజేయండి, అతనికి సహకరించండి అని మోడీ ని కోరాను. ఇలాంటి వ్యక్తిగత సంభాషణలను రాజకీయ వేదికపై వెల్లడించడం ప్రధానికి తగునా? అంటూ మోడీ తీరును కెసిఆర్ తప్పుపట్టారు. నిజమాబాద్ సభలో మోడీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపగా కెసిఆర్ తనయుడు…మంత్రి కేటీఆర్ ఇది అంతా తప్పు…తాను సీఎం కావటానికి….మోడీ అనుమతి అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు స్వయంగా కెసిఅర్ ఈ విషయాలు నిజం అని చెప్పటంతో వీళ్ళు ఏ విషయంలో కూడా నిజం చెప్పరేమో అనే అనుమానాలు రావటం సహజం. ఈ ఇంటర్వ్యూ లో కెసిఆర్ కేంద్రంలోని కేంద్రంలో మోడీ పాలన వంద శాతం దారుణంగా ఉంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయన పాలన లోనే రూపాయి కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది అని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇందులోని అంశాలు దుమారం రేపటం ఖాయంగా కనిపిస్తున్నాయి.
