తెలంగాణకు మొండి చేయి చూపిన కేంద్ర బడ్జెట్: బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు

కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి): బిజెపి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చెయ్యిచూపించిందని జీవి రామకృష్ణారావు విమర్శించారు. పార్లమెంటు సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 -26 బడ్జెట్ గణంకాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రం నుండి ఇద్దరు మంత్రులున్నప్పటికీ ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా దక్కలేదు,.వెనుకబడిన జిల్లాల జాబితాలో రాయలసీమ ను ఉత్తరాంధ్రను చేర్చారు. కానీ తెలంగాణ నుంచి మూలుగు, భూపాలపల్లి ,మహబూబాద్ అదిలాబాద్ ,భద్రాది కొత్తగూడెం లాంటి వెనుకబడిన జిల్లాలను కూడా చేర్చలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ కు 15 వేల కోట్లు కేటాయించింది మరి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదని రామకృష్ణారావు ఆరోపించారు. ఈ నిధుల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 50,65,345 కోట్లతో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 12,76,338 కోట్లు అంటే 25. 2% వడ్డీలు చెల్లింపులకే కేటాయించారు. వ్యవసాయ రంగానికి గతం కంటే పదివేల కోట్ల రూపాయలు తగ్గించారు. ఎరువుల సబ్సిడీకి 11 వేల కోట్లు కోత విధించారు. ఉపాధి హామీ చట్టానికి గతంలో 89 వేల 154 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో 86 వేల కోట్లు కేటాయించారు. 3000 కోట్ల కోత పెట్టారు దళితులకు 16% నిధులు కేటాయించాల్సింది ఉండగా కేవలం ఐదు శాతం మాత్రమే కేటాయించారు అని విమర్శించారు. మధ్యతరగతి ప్రజానీకానికి ఆదాయ పన్ను 12 లక్షల వరకు మినహాయింపు ప్రకటించినప్పటికీ, ధరల నియంత్రణ ఊసే ఎత్తలేదు. బడా కార్పొరేట్ సంస్థల పైన ఎటువంటి భారాలు విధించలేదు. భీమా రంగంలో 100% ఎఫ్ డి ఐ ను అనుమతిస్తూ భీమా రంగం ఉనికికే ప్రమాదంలో పడేసింది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల నుండి 47 వేల కోట్ల రూపాయల విలువ చేసే వాటాలను ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు విక్రయించాలని నిర్ణయించింది. ఇది ముమ్మాటికి ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టే బడ్జెట్ తప్ప సామాన్య పేద మధ్యతరగతులకు ఉపయోగపడే విధంగా లేదని విమర్శించారు. నిజంగా బిజెపి ప్రభుత్వానికి దేశం మీద ప్రేమ ఉంటే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్లో మార్పులు చేర్పులు చేయాలని డిమాండ్ చేశారు. 8 మంది కాంగ్రెసు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండీ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి 1.63 కోట్ల నిధులు రావాలని తిరిగిన ఫలితం లేకుండా పోయిందని జీవి రామకృష్ణా రావు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కేంద్ర నిధులు ఒక్క రూపాయి కేటాయించక పోయినా కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ లాంటి నిర్మాణం చేపట్టారని అన్నారు. రిజినల్ రింగ్ రోడ్డు మెట్రో మూసీ పుననిర్మాణం కాజీపేట రైల్వే కరీంనగర్ రైల్వే లైన్ కేంద్ర విద్యాలయాలు. విభజనాచట్టం లొ ఇచ్చిన హామీలు కేంద్రం నుండి రావసిన గ్రాంట్లు ఒక్క రూపాయి కూడ కేంద్ర ప్రభుత్వం నుండి తెలేదు కానీ వీటి ప్రతి పాదనలు జీరాక్స్ పేపర్లు పట్టు కొని 30 సార్లు డిల్లీ పర్యటన పేరుతో తెలంగాణ ప్రజల సొమ్ముతో జెల్షా లు చేస్తూ పబ్బంగడుపుతున్నారని.విమర్శించారు.

తెలంగాణకు మొండి చేయి చూపిన కేంద్ర బడ్జెట్: బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు

కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి):
బిజెపి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చెయ్యిచూపించిందని జీవి రామకృష్ణారావు విమర్శించారు. పార్లమెంటు సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 -26 బడ్జెట్ గణంకాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రం నుండి ఇద్దరు మంత్రులున్నప్పటికీ ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా దక్కలేదు,.వెనుకబడిన జిల్లాల జాబితాలో రాయలసీమ ను ఉత్తరాంధ్రను చేర్చారు. కానీ తెలంగాణ నుంచి మూలుగు, భూపాలపల్లి ,మహబూబాద్ అదిలాబాద్ ,భద్రాది కొత్తగూడెం లాంటి వెనుకబడిన జిల్లాలను కూడా చేర్చలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ కు 15 వేల కోట్లు కేటాయించింది మరి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదని రామకృష్ణారావు ఆరోపించారు.
ఈ నిధుల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
50,65,345 కోట్లతో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 12,76,338 కోట్లు అంటే 25. 2% వడ్డీలు చెల్లింపులకే కేటాయించారు. వ్యవసాయ రంగానికి గతం కంటే పదివేల కోట్ల రూపాయలు తగ్గించారు. ఎరువుల సబ్సిడీకి 11 వేల కోట్లు కోత విధించారు. ఉపాధి హామీ చట్టానికి గతంలో 89 వేల 154 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో 86 వేల కోట్లు కేటాయించారు. 3000 కోట్ల కోత పెట్టారు దళితులకు 16% నిధులు కేటాయించాల్సింది ఉండగా కేవలం ఐదు శాతం మాత్రమే కేటాయించారు అని విమర్శించారు. మధ్యతరగతి ప్రజానీకానికి ఆదాయ పన్ను 12 లక్షల వరకు మినహాయింపు ప్రకటించినప్పటికీ, ధరల నియంత్రణ ఊసే ఎత్తలేదు. బడా కార్పొరేట్ సంస్థల పైన ఎటువంటి భారాలు విధించలేదు. భీమా రంగంలో 100% ఎఫ్ డి ఐ ను అనుమతిస్తూ భీమా రంగం ఉనికికే ప్రమాదంలో పడేసింది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల నుండి 47 వేల కోట్ల రూపాయల విలువ చేసే వాటాలను ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు విక్రయించాలని నిర్ణయించింది. ఇది ముమ్మాటికి ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టే బడ్జెట్ తప్ప సామాన్య పేద మధ్యతరగతులకు ఉపయోగపడే విధంగా లేదని విమర్శించారు. నిజంగా బిజెపి ప్రభుత్వానికి దేశం మీద ప్రేమ ఉంటే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్లో మార్పులు చేర్పులు చేయాలని డిమాండ్ చేశారు. 8 మంది కాంగ్రెసు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండీ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి 1.63 కోట్ల నిధులు రావాలని తిరిగిన ఫలితం లేకుండా పోయిందని జీవి రామకృష్ణా రావు మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కేంద్ర నిధులు ఒక్క రూపాయి కేటాయించక పోయినా కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ లాంటి నిర్మాణం చేపట్టారని అన్నారు.
రిజినల్ రింగ్ రోడ్డు మెట్రో మూసీ పుననిర్మాణం కాజీపేట రైల్వే కరీంనగర్ రైల్వే లైన్ కేంద్ర విద్యాలయాలు. విభజనాచట్టం లొ ఇచ్చిన హామీలు కేంద్రం నుండి రావసిన గ్రాంట్లు ఒక్క రూపాయి కూడ కేంద్ర ప్రభుత్వం నుండి తెలేదు కానీ వీటి ప్రతి పాదనలు జీరాక్స్ పేపర్లు పట్టు కొని 30 సార్లు డిల్లీ పర్యటన పేరుతో తెలంగాణ ప్రజల సొమ్ముతో జెల్షా లు చేస్తూ పబ్బంగడుపుతున్నారని.విమర్శించారు.

About The Author