అంగరంగ వైభవంగా వసంత పంచమి మహోత్సవ వేడుకలు.
కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి): వసంత పంచమి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని చైతన్యపురిలోగల మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి అమ్మవార్ల దివ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. చదువుల తల్లిగా, జ్ఞాన దేవతగా ప్రసిద్ధికెక్కి , చిన్నారుల అక్షరాభ్యాసానికి కొంగుబంగారంగా మారిన శ్రీ మహాశక్తి దేవాలయంలోని శ్రీ మహాసరస్వతి అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. అక్షర స్వీకార , పుస్తక పూజల కోసం చిన్నారులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులతో సోమవారం రోజున వసంత పంచమి మహోత్సవ పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి అమ్మవార్లకు అభిషేకం, ఉదయం 7 గంటలకు శ్రీ మహా సరస్వతి దేవి పూజ, అభిషేకం, కుంకుమార్చన, ఉదయం 8 గంటలకు విద్యార్థుల సామూహిక పుస్తక పూజలు, చిన్నారుల అక్షర స్వీకారము కార్యక్రమాలను కన్నుల పండుగ చేపట్టారు. చదువుల తల్లిగా, జ్ఞాన దేవతగా ప్రసిద్ధికెక్కి, చిన్నారుల అక్షరాభ్యాసానికి కొంగుబంగారంగా మారిన శ్రీ మహా సరస్వతి అమ్మవారితోపాటు శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాదుర్గ అమ్మవార్లు దేవాలయంలో కొలువుతీరి ఉండడంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు.
కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి):
వసంత పంచమి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని చైతన్యపురిలోగల మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి అమ్మవార్ల దివ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. చదువుల తల్లిగా, జ్ఞాన దేవతగా ప్రసిద్ధికెక్కి , చిన్నారుల అక్షరాభ్యాసానికి కొంగుబంగారంగా మారిన శ్రీ మహాశక్తి దేవాలయంలోని శ్రీ మహాసరస్వతి అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. అక్షర స్వీకార , పుస్తక పూజల కోసం చిన్నారులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు.
శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులతో సోమవారం రోజున వసంత పంచమి మహోత్సవ పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి అమ్మవార్లకు అభిషేకం, ఉదయం 7 గంటలకు శ్రీ మహా సరస్వతి దేవి పూజ, అభిషేకం, కుంకుమార్చన, ఉదయం 8 గంటలకు విద్యార్థుల సామూహిక పుస్తక పూజలు, చిన్నారుల అక్షర స్వీకారము కార్యక్రమాలను కన్నుల పండుగ చేపట్టారు. చదువుల తల్లిగా, జ్ఞాన దేవతగా ప్రసిద్ధికెక్కి, చిన్నారుల అక్షరాభ్యాసానికి కొంగుబంగారంగా మారిన శ్రీ మహా సరస్వతి అమ్మవారితోపాటు శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాదుర్గ అమ్మవార్లు దేవాలయంలో కొలువుతీరి ఉండడంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు.
