ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తాం: సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి

కరీంనగర్, జనవరి 30(భారత శక్తి) సీపీఎం రాష్ట్ర మహాసభల్లో 49తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయని, ఆ దిశలోనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలను ఉదృతం చేస్తామని, గ్రామ గ్రామాన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామని జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి స్పష్టం చేశారు. గురువారం నగరంలోగల ముకుండలాల్ మిశ్రా భవన్ లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభలో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ జాన్ వెస్లీనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. నూతన ఉత్తేజం, ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వామపక్ష ఐక్యతతో పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర మహాసభల్లో చర్చించామని ప్రధానంగా కరీంనగర్లోని డంపింగ్ యార్డ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్, త్రిబుల్ ఐటీ, ఈఎస్ఐ ఆసుపత్రి, కల్పించాలని కరీంనగర్ జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు సాగుభూములు కేటాయిం చే వరకు పోరాడుతామని హెచ్చరించారు. అలాగే మాజీ మంత్రి గంగుల, మాజీ మేయర్ సునీల్ రావులు అవినీతి అనకొండలే అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో మాజీ నగర మేయర్ వై.సునీల్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటు ప్రజా సమస్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వారుచేస్తున్న ఆరోపణలు ఇరువురు సాక్షాలతో బయట పెట్టాలని, దుర్వినియోగం అయినా ప్రజాధనాన్ని రికవరీ చేసే విధంగా దర్యాప్తు సంస్థలు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని పార్కులు, చెరువులు, శిఖం భూములు, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను, రెవిన్యూ అధికార యంత్రాంగం విచారణ జరిపించి రికవరీ చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మతోన్మాదం పెచ్చుమీరిపోతుందని, ఈ మహాసభల్లో ప్రధానంగా మతోన్మాద బిజెపిని నిలువరించి, వామపక్ష ఐక్యతతో సామాజిక ఉద్యమాలను బలోపేతం చేస్తామని అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ అవగాహన లేకుండా గద్దర్ పై అనుచిత వాక్యాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బిజెపి కార్యకర్తలను తయారుచేసి, మతోన్మాద భావజాలం ఉన్న వారికే పద్మశ్రీ అవార్డులు ఇస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. సామాజిక ఉద్యమాల కోసం, బడుగు బలహీన వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయులు ప్రజా గాయకుడు గద్దరని ఆయనకే పద్మశ్రీ ఇవ్వడం కూడా తక్కువేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు 2500 రూపాయల పెన్షన్, వికలాంగ , వృద్ధుల పెన్షన్లను పెంచుతామని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, వాగ్దానాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో వామపక్ష ప్రజాతంత్ర వాదులను కలుపుకొని ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లాకమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఇ.రమేష్, కోనేటి నాగమణి, డి. నరేష్ పటేల్, నాయకులు రాయికంటీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తాం: సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి

కరీంనగర్, జనవరి 30(భారత శక్తి)
సీపీఎం రాష్ట్ర మహాసభల్లో 49తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయని, ఆ దిశలోనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలను ఉదృతం చేస్తామని, గ్రామ గ్రామాన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామని జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి స్పష్టం చేశారు. గురువారం నగరంలోగల ముకుండలాల్ మిశ్రా భవన్ లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభలో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ జాన్ వెస్లీనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. నూతన ఉత్తేజం, ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వామపక్ష ఐక్యతతో పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు.
కరీంనగర్ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర మహాసభల్లో చర్చించామని ప్రధానంగా కరీంనగర్లోని డంపింగ్ యార్డ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్, త్రిబుల్ ఐటీ, ఈఎస్ఐ ఆసుపత్రి, కల్పించాలని కరీంనగర్ జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు సాగుభూములు కేటాయిం చే వరకు పోరాడుతామని హెచ్చరించారు. అలాగే
మాజీ మంత్రి గంగుల, మాజీ మేయర్ సునీల్ రావులు అవినీతి అనకొండలే అన్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో మాజీ నగర మేయర్ వై.సునీల్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటు ప్రజా సమస్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
వారుచేస్తున్న ఆరోపణలు ఇరువురు సాక్షాలతో బయట పెట్టాలని, దుర్వినియోగం అయినా ప్రజాధనాన్ని రికవరీ చేసే విధంగా దర్యాప్తు సంస్థలు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ లోని పార్కులు, చెరువులు, శిఖం భూములు, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను, రెవిన్యూ అధికార యంత్రాంగం విచారణ జరిపించి రికవరీ చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మతోన్మాదం పెచ్చుమీరిపోతుందని, ఈ మహాసభల్లో ప్రధానంగా మతోన్మాద బిజెపిని నిలువరించి, వామపక్ష ఐక్యతతో సామాజిక ఉద్యమాలను బలోపేతం చేస్తామని అన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ అవగాహన లేకుండా గద్దర్ పై అనుచిత వాక్యాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బిజెపి కార్యకర్తలను తయారుచేసి, మతోన్మాద భావజాలం ఉన్న వారికే పద్మశ్రీ అవార్డులు ఇస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. సామాజిక ఉద్యమాల కోసం, బడుగు బలహీన వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయులు ప్రజా గాయకుడు గద్దరని ఆయనకే పద్మశ్రీ ఇవ్వడం కూడా తక్కువేనని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు 2500 రూపాయల పెన్షన్, వికలాంగ , వృద్ధుల పెన్షన్లను పెంచుతామని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, వాగ్దానాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలో వామపక్ష ప్రజాతంత్ర వాదులను కలుపుకొని ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లాకమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఇ.రమేష్, కోనేటి నాగమణి, డి. నరేష్ పటేల్, నాయకులు రాయికంటీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

About The Author