ఎవ్వరీ మురళి మోహన్

ప్రముఖ టీవీ నందు రాయలసీమ ఇంచార్జిగా,సీనియర్ పాత్రికేయునిగా,జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా మంచి హోదాలో గుర్తింపు పొందిన వ్యక్తి మురళి మోహన్.ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి లేని హుందా జీవితం.ముక్కుసూటి మనిషి. గత కొంతకాలంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఇంచార్జి లేకపోవడం కారణంగా పార్టీ అధినేత,జిల్లా అధ్యక్షులు మంచి దీటైన అభ్యర్థిని నియమించుటకు సంకల్పించింది.పలు పర్యాయాలు సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించే బలమైన ఇంచార్జి సమాలోచనలో భాగంగా ఇదే నియోజకవర్గానికి చెందిన పాత్రికేయుడు,కొంత ఆర్థిక వనరులు న్న మురళి మోహన్ ను పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించింది.ఇతనికి బలమైన కొంతమంది టీడీపి ఎమ్మెల్యే అభ్యర్థులు,సీనియర్ నాయకులు ఇంచార్జిగా రావడానికి కృషి చేశారు.ఈ నేపథ్యంలో మొదటి సరిగా గ్రామ వస్త్రధారణతో నియోజకవర్గంలో ప్రజలను ఆత్మీయంగా గడపగడపకు వెళ్లి పలకరిస్తూ సుడిగాలి పర్యటన చేశారు.అంతా బాగానే ఉన్నను నాయకులను కలుపుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. విమర్శకులకు అవకాశం కల్పిస్తున్నది. ఫోన్ కాల్స్ చేసినా లేదా వాట్సాప్ మెసేజ్ చేసినా సరిగ్గా స్పందించడం లేదనే విమర్శలున్నాయి.ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే అనునిత్యం కార్యక్రమాల్లో నిమగ్నమై అందరిని కలుపుకొని మరొకసారి ఎమ్మెల్యేగా అఖండ విజయంతో గెలవాలని పూనుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించబడిన మురళీమోహన్ పార్టీలో సీనియర్లను కలుపుకొనిపోతూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వారధిగా ముందుకు పోగలిగితే అధికార పార్టీ ఎమ్మెల్యేను దీటుగా ఎదుర్కొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించవచ్చని విశ్లేషకులు వారి అభిప్రాయాన్ని తెలిపారు. ప్రజాసేవ చేయుటకు వచ్చిన ఎవరైనాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తన చేతనైన సహాయం సహకారం అందిస్తూ ఏ సమయంలోనైనను పలికే వ్యక్తిగా గుర్తింపు పొందగలిగితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తథ్యమని సగటు మానవునిగా విజ్ఞప్తి చేస్తున్నాను

ఎవ్వరీ మురళి మోహన్

ప్రముఖ టీవీ నందు రాయలసీమ ఇంచార్జిగా,సీనియర్ పాత్రికేయునిగా,జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా మంచి హోదాలో గుర్తింపు పొందిన వ్యక్తి మురళి మోహన్.ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి లేని హుందా జీవితం.ముక్కుసూటి మనిషి.
గత కొంతకాలంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఇంచార్జి లేకపోవడం కారణంగా పార్టీ అధినేత,జిల్లా అధ్యక్షులు మంచి దీటైన అభ్యర్థిని నియమించుటకు సంకల్పించింది.పలు పర్యాయాలు సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించే బలమైన ఇంచార్జి సమాలోచనలో భాగంగా ఇదే నియోజకవర్గానికి చెందిన పాత్రికేయుడు,కొంత ఆర్థిక వనరులు న్న మురళి మోహన్ ను పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించింది.ఇతనికి బలమైన కొంతమంది టీడీపి ఎమ్మెల్యే అభ్యర్థులు,సీనియర్ నాయకులు ఇంచార్జిగా రావడానికి కృషి చేశారు.ఈ నేపథ్యంలో మొదటి సరిగా గ్రామ వస్త్రధారణతో నియోజకవర్గంలో ప్రజలను ఆత్మీయంగా గడపగడపకు వెళ్లి పలకరిస్తూ సుడిగాలి పర్యటన చేశారు.అంతా బాగానే ఉన్నను నాయకులను కలుపుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. విమర్శకులకు అవకాశం కల్పిస్తున్నది. ఫోన్ కాల్స్ చేసినా లేదా వాట్సాప్ మెసేజ్ చేసినా సరిగ్గా స్పందించడం లేదనే విమర్శలున్నాయి.ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే అనునిత్యం కార్యక్రమాల్లో నిమగ్నమై అందరిని కలుపుకొని మరొకసారి ఎమ్మెల్యేగా అఖండ విజయంతో గెలవాలని పూనుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించబడిన మురళీమోహన్ పార్టీలో సీనియర్లను కలుపుకొనిపోతూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వారధిగా ముందుకు పోగలిగితే అధికార పార్టీ ఎమ్మెల్యేను దీటుగా ఎదుర్కొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించవచ్చని విశ్లేషకులు వారి అభిప్రాయాన్ని తెలిపారు. ప్రజాసేవ చేయుటకు వచ్చిన ఎవరైనాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తన చేతనైన సహాయం సహకారం అందిస్తూ ఏ సమయంలోనైనను పలికే వ్యక్తిగా గుర్తింపు పొందగలిగితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తథ్యమని సగటు మానవునిగా విజ్ఞప్తి చేస్తున్నాను

About The Author

Related Posts