ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్న ఆరోగ్య శాఖ మంత్రి..

పోరుమామిళ్ల :

- సారూ జర పోరుమామిళ్ల 50 పడకల ప్రభుత్వాసుపత్రి పై దృష్టి సారిస్తారా...?
- ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఎక్కడ ...? 
- గర్భవతులకు తప్పని కార్పొరేటు ఆసుపత్రుల తిప్పలు
- పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన సీపీఐ బృదం

WhatsApp Image 2025-09-26 at 8.23.52 PM (1)

పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రిలో  గైనకాలజిస్ట్, ఈఎన్టీ డాక్టర్, మత్తు డాక్టర్, ఎక్సేరా తీసే డాక్టర్, దంత వైద్యులు లేకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందలేదని సీపీఐ ఏరియా సహాయ కార్యదర్శిపిడుగు మస్తాన్, మండలకార్యదర్శిరవికు మార్, మండల సహాయ కార్యదర్శి కేశవలు మండి పడ్డారు. శుక్రవారం పోరుమామిళ్ల పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ తన బృందం తో పర్యటించి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో 50పడకలు పరిశీలించగా బెడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. చంటిపిల్లల్ని ఉంచే ఇంకు బేటర్లలో ఒక్క చంటి బిడ్డను  ఒకగంటైనా ఉంచిన దాఖలాలు లేవని చెప్పవచ్చన్నారు. ఆసుపత్రిలో13 మందివైద్యులు ఉండి రోగులకు చికిత్సలు అందించాల్సి ఉంది. కానీ ఇక్కడ 5 మంది వైద్యులను నియమించారు.కేవలం ముగ్గురు డాక్టర్లు విధుల్లో ఉండి సేవలు అందిస్తున్నారు.ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రభలి జనాలు భయాందోళనకు గురవు తున్నారన్నారు. ఇక్కడ ఉండాల్సిన వైద్యులు లేకపోవడంతో ఉన్న వైద్యులు సరైన వైద్యం అందించ లేకపోతు న్నారన్నారు. ఏమాత్రం చిన్న రక్తగాయాలు జరిగినా, ప్రమాదం జరిగిన, ప్రసవ నొప్పులతో వచ్చినా ఇక్కడి వైద్యులు కడప, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రులకు 108 అంబులెన్స్ కు రెపర్ చేసి ఎక్కించడమే గాని, చికిత్సలు అందించేందుకు వెనకాడుతున్నారన్నారు. వైద్య సిబ్బంది రోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయన్నారు. గతంలో ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగి మంచి పేరు ఆసుపత్రికి ఉండేదన్నారు.ఆయాసం వచ్చినా వెంటనే కడపకు పొమ్మనే చెబుతా రు గాని వైద్య చికిత్సలు చేయరన్నారు.మేము అన్నిసేవలు చేస్తున్నామని అందరికి చెబుతున్నారు తప్ప సేవలు కనిపించడం లేదన్నారు.ఆసుపత్రి ఆవరణ సరిగా నిర్వహణ లేదన్నారు. కాలు విరిగిన,చెయ్యి బెనికి నా ఎక్సేరే తీసేవారు లేకపోవడంతో ప్రైవేటు సెంటర్లలోకి వెళ్లి తీయించు కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దంత వైద్యులు ఎక్కడ కనిపించడం లేదు. ఈవిషయం పై డాక్టర్ నాగలక్షి,డాక్టర్ రవిలను అడిగితే వారు గైనకాలజిస్ట్ ప్రసూతి సెలవుల్లో వెళ్లడంతో ఇక్కడ గైనకాల జిస్ట్ డాక్టర్ లేరన్నారు. దీని కారణంగా ఇక్కడ ఆపరేషన్లు చేయక పోవ డంతో బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏమి అడిగినా వైద్యులు లేరని చెబుతారు గాని,సమస్యలపై మాత్రం దాటవేస్తున్నారన్నారు. రాత్రిపూట ఇక్కడే విధుల్లో ఉండి సేవలు అందిస్తున్నామని చెబుతారు అయితే జిల్లా ఆసుపత్రులకు పంపుతారని అడిగితే మాకు మించిన కేసులు వస్తే పంపుతామంటున్నారన్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైద్యులను నియమించి ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీరయ్యసఫా,చాంద్బాషా,షాహిదా,విశ్వాసమ్మ,గురమ్మ,తదితరులు పాల్గొన్నారు. 

About The Author