అక్టోబర్‌లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి జిల్లా ప్రతినిధి :
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో
అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి ఉత్సవం.. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో
అక్టోబర్ 11, 18, 25 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు అభిషేకం.. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో..
అక్టోబరు 10, 17, 24, 31 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు అభిషేకం, వస్త్రలంకారణ సేవ. అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10.30 గం.లకు కల్యాణోత్సవం.. అక్టోబర్ 7న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ. అక్టోబర్ 8న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం. అక్టోబర్ 12, 19, 26 తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి అభిషేకం.