సీఎం నివాసంతోపాటు ఏడుచోట్ల బాంబులు పేలతాయ్…
ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నివాసగృహంతో పాటు ఏడు చోట్ల బాంబులు పేలుతాయంటూ ఫోన్ చేసి బెదిరించిన ఊటీకి చెందిన కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. నీలగిరి(Neelagiri) జిల్లా ఊటీలోని 108 అంబులెన్స్ కేంద్రానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ముఖ్యమంత్రి నివాసగృహంతో పాటు మరో ఆరు ప్రాంతాల వద్ద బాంబులు పేలనున్నాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో దిగ్ర్భాంతికి గురైన అంబులెన్స్ కేంద్ర సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు ఆ విషయాన్ని చేరవేశారు. వెంటనే చెన్నై(Chennai)లోని పోలీసులకు సమాచారం అందించి ముఖ్యమంత్రి నివాసం వద్ద తనిఖీ చేయాలని సూచించారు. చివరకు ఆ బెదిరింపు ఉత్తుత్తిదేనని నిర్ధారణ అవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత అంబులెన్స్ సేవా కేంద్రం ఫోన్‌లో నమోదైన ఫోన్ నెంబర్ ఆధారంగా బాంబు బెదిరించిన వ్యక్తి ఊటీ(Ooty)లోని తంబంపట్టి ప్రాంతానికి చెందిన గణేశన్ అని తెలుసుకున్నారు. సోమవారం వేకువజాము గణేశన్ ఇంటి వద్దకు వెళ్ళిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు. మద్యం మత్తులో తాను ఫోన్ చేసి బెదిరించినట్లు గణేశన్ విచారణలో తెలిపాడు. ఊటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.