హైదరాబాద్‌లో విషం చిమ్ముతున్న డ్రగ్స్ సంస్కృతి.. 

  • నిర్వీర్యం అయిపోతున్న యువత భవితవ్యం.. 
  • రోజు రోజుకూ పెరిగిపోతున్న నేరాల శాతం..
  • మత్తులో పడి మానవత్వం మరచిపోతున్న దౌర్భాగ్యం.. 
  • అక్రమ సంపాదనకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కొందరు.. 
  • భవిష్యత్తు అంధకారమై బానిసలవుతున్న మరికొందరు.. 
  • ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆగని దందా.. 
  • కార్పొరేట్ కల్చర్ కు అలవాటుపడిన సమాజంలో కీలకపాత్ర పోషిస్తున్న డ్రగ్స్.. 
  • వేగంగా పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం భవిష్యత్తులో పెను ప్రమాదం.. 
  • ఆరోగ్యాలు చెడగొట్టుకోవడమే కాకుండా సమాజాన్ని నాశనం చేస్తున్నారు.. 
  • మరింత ప్రమాదకరంగా మారిన సులువుగా దొరికే గంజాయి.. 
  • పోలీసులకు తెలిసినా లంచాలకు దాసోహం అంటున్నారు..!
  • కట్టడి చేయాలనే దృక్పథం ఉంటే.. అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదు.. 
  • డ్రగ్స్ కల్చర్ పై సమర శంఖం పూరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

38546336402_1337e427fb_b

నిరుద్యోగం.. రౌడీయిజం.. ఫారిన్ కల్చర్.. అదుపులేని సుఖాల అనుభూతి.. ఇలా ఎన్నెన్నో కారణాలు యువతను మత్తు వైపు మరలిస్తున్నాయి..  మత్తులో జోగుతూ మరో ప్రపంచంలో విహరిస్తున్నారు.. అంతులేని సుఖానుభూతులను అనుభవిస్తున్నారు.. వాస్తవజీవితానికి దూరంగా..  కన్నవారికి కడుపుకోతగా.. సమాజానికి చీడపురుగుల్లా బ్రతుకుతున్నారు.. యువత అంతా ఈ విధంగా ఉందని కాదు..  నూటికి 70 శాతం ఇదే పరిస్థితుల్లో జీవిస్తున్నారు.. మరో 10 శాతం మంది జీవితం మీద విరక్తితోనో.. చదివిన చదువుకు తగిన ఫలితం దక్కలేదనే  మానసిక వ్యథతో మత్తుకు బానిసలవుతున్నారు.. ఇలాంటి వారిని టార్గెట్ గా చేసుకున్న కొన్ని ముఠాలు వారికి డ్రగ్స్  సరఫరా చేస్తున్నారు..  బాగా సంపన్న కుటుంబాల నుంచి వచ్చేవారు విచ్చలవిడి తనానికి అలవాటుపడి ఎంతైనా చెల్లించి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు..  పేదవర్గానికి చెందినవారు చౌకగా దొరికే గంజాయిని ఆశ్రయిస్తున్నారు.. ప్రభుత్వాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా  ఈ మత్తు ప్రపంచాన్ని చెదరగొట్టలేకుండా ఉన్నారు.. కారణం అవినీతి అధికారులు.. ఈ అధికారులకు తమ వంతు సహకారం అందిస్తున్న  రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు.. ఈ పద్ధతి మారాలని, యువత నిర్వీర్యం కాకూడదని పోరాటం సాగిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..    

Read More ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి..

స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ :
హైదరాబాద్ మహా నగరం ఒకప్పుడు విద్య, ఉద్యోగాలు, ఐటీ రంగం, వ్యాపార అవకాశాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. కానీ ఇటీవలి కాలంలో ఈ నగరాన్ని “డ్రగ్స్ హబ్”గా మలచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా యువతలో డ్రగ్స్ వినియోగం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం.. నగరంలోని పబ్‌లు, బార్‌లు, ప్రైవేట్ పార్టీల్లో గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ, ఎక్స్టసీ వంటి మాదక ద్రవ్యాలు సులభంగా లభ్యమవుతున్నాయి. కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు, సినిమా, ఫ్యాషన్ రంగాలకు చెందినవారు ఈ వ్యసనానికి బలవుతున్నారు. డ్రగ్ మాఫియాలు రహస్యంగా నెట్‌వర్క్‌లు ఏర్పరచుకుని, ఆన్‌లైన్ డెలివరీ విధానాల ద్వారా సరఫరా చేస్తున్నారు.

Read More దోప దీప నైవేద్య సమావేశం..

డ్రగ్స్ వాడకంతో విపరీత పరిణామాలు నెలకొంటున్నాయి.. : యువత చదువులు, కెరీర్ తో బాటు జీవితాలు కూడా దెబ్బతింటున్నాయి. కుటుంబాలు సైతం విచ్ఛిన్నమవుతున్నాయి. అంతే కాకుండా నేరాల రేటు విపరీతంగా పెరుగుతోంది. మహిళలకు, మంచివాలకు రక్షణ లేకుండా పోతోంది.. మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ప్రయోజనం కనిపించడం లేదు.. ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ పోలీస్ బృందాలు తరచూ రైడ్లు నిర్వహిస్తున్నప్పటికీ, డ్రగ్స్ చొరబాటు ఆగడం లేదు. అంతర్జాతీయ మాఫియాల వరకు ఈ నెట్‌వర్క్ విస్తరించి ఉండటమే ప్రధాన కారణం.. అదే ఇప్పుడు సవాలుగా మారిపోయింది.. 

Read More హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు విద్యార్థుల ఎంపిక

ఈ క్లిష్ట పరిస్థితుల్లో.. తల్లి దండ్రులు పిల్లలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.. పోలీసులు, సామాజిక వేత్తలు, స్వచ్చంద సంస్థలు, విద్యా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అంతే కాకుండా యువతకు సరైన దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఒకవైపు ప్రభుత్వం రైడ్లు, అరెస్టులు చేస్తుంటే, మరోవైపు డ్రగ్స్ మాఫియాలు మరింత బలంగా వేర్లు వేస్తుండటమేంటి? దీనికి సమాధానం స్పష్టంగా అర్ధం అవుతూ వుంది.. మన సమాజం నిర్లక్ష్యం. తల్లి దండ్రులు పిల్లలపై శ్రద్ధ తగ్గించారు, విద్యాసంస్థలు కేవలం మార్కులపైనే దృష్టి పెడుతున్నాయి, పోలీసులు, అధికారులు కొంతమంది లాభాల కోసం కళ్ళు మూస్తున్నారు. ఈ డ్రగ్ సంస్కృతి కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక తరం మొత్తాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది. 

Read More అభివృద్ధి పనులను జాతరలా ప్రారంభించన కలెక్టర్

డ్రగ్స్ లేని హైదరాబాద్ అనే లక్ష్యం కేవలం నినాదం కాకుండా, ఒక సామూహిక బాధ్యత కావాలి. లేనిపక్షంలో, ఐటీ నగరంగా ప్రపంచంలో పేరొందిన హైదరాబాద్, త్వరలోనే “డ్రగ్స్ సిటీ” అనే చెడు ముద్రను తప్పించుకోలేకపోతుంది. డ్రగ్ వినియోగాన్ని కఠినంగా నిరోధించే చట్టాలు కఠినంగా అమలు కావాల్సిన అవసరం ఎంతో ఉంది.. హైదరాబాద్ అభివృద్ధి, ఆధునికత పేరుతో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోతే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడతాయి. కాబట్టి ఇది కేవలం ప్రభుత్వమే కాక, సమాజమంతటికీ ఎదురైన ఒక పెద్ద సవాలు. ఈ సవాలును స్వీకరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ..

Read More హెచ్‌ఎమ్‌డిఎతో అభివృద్ధి శూన్యం..

About The Author