అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాస్ వెగాస్‌లోని నెవాడా యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో (UNLV) బుధవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు తెగబడిన నిందితుడు కూడా మరణించాడని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కాల్పుల్లో మరణించిన వారి వివరాలను అధికారులు ఇంకా గుర్తించలేదు. కాల్పుల ఘటన అనంతరం యూనివర్సిటీని పోలీసులు ఖాళీ చేయించారు. ‘యూనివర్సిటీలో ముగ్గురి మ‌ృతదేహాలను గుర్తించాం. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అతని పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయినవారిలో కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు.’’ అని లాస్ వెగాస్ మెట్రోపాలిటర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సంఘటన నేపథ్యంలో నెవాడా విశ్వవిద్యాలయం, అన్ని ఇతర దక్షిణ నెవాడా విద్యాసంస్థలను బుధవారం(స్థానిక కాలమానం) మూసివేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. విశ్వవిద్యాలయం సమీపంలోని పలు రహదారులను కూడా పోలీసులు మూసివేశారు. లాస్ వెగాస్ స్ట్రిప్‌కు తూర్పున రెండు మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న నెవాడా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో దాదాపు 25,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 8,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరల్ విద్యార్థులున్నారు.

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాస్ వెగాస్‌లోని నెవాడా యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో (UNLV) బుధవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు తెగబడిన నిందితుడు కూడా మరణించాడని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కాల్పుల్లో మరణించిన వారి వివరాలను అధికారులు ఇంకా గుర్తించలేదు. కాల్పుల ఘటన అనంతరం యూనివర్సిటీని పోలీసులు ఖాళీ చేయించారు.

‘యూనివర్సిటీలో ముగ్గురి మ‌ృతదేహాలను గుర్తించాం. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అతని పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయినవారిలో కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు.’’ అని లాస్ వెగాస్ మెట్రోపాలిటర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సంఘటన నేపథ్యంలో నెవాడా విశ్వవిద్యాలయం, అన్ని ఇతర దక్షిణ నెవాడా విద్యాసంస్థలను బుధవారం(స్థానిక కాలమానం) మూసివేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. విశ్వవిద్యాలయం సమీపంలోని పలు రహదారులను కూడా పోలీసులు మూసివేశారు. లాస్ వెగాస్ స్ట్రిప్‌కు తూర్పున రెండు మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న నెవాడా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో దాదాపు 25,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 8,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరల్ విద్యార్థులున్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

చదువు "కొంటున్నాం" చదువు "కొంటున్నాం"
చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..  న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..  అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం.....
ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

Related Posts