నులిపురుగుల నివారణకు చర్యలు : జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
ఫిబ్రవరి 10వ తేదీ “జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం”(డివార్మింగ్ డే)సందర్భంగా జిల్లాలో నాలుగు లక్షల 70 వేలకు పైగా పిల్లలకు నులిపురుగుల మందుల ఉచిత పంపిణీ వైయస్సార్ జిల్లా, ఫిబ్రవరి 7:నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఈనెల ఫిబ్రవరి 10తేదీన జిల్లాలో ఉన్న 1నుంచి 19 సంవత్సరాల వయసు లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులు సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో నులి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై (జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్) సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ…. నులి పురుగులు ప్రమాదకరమని, వీటి తో రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, వీటిని నివారిస్తే ఆరోగ్యంగా వుండవచ్చన్నారు. నులి పురుగుల నియంత్రణ కీలకమైన అంశమని, దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారికి కేటాయించిన విధులను సమన్వయంతో కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, పైవ్రేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో నులిపు రుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.జిల్లాలోని అంగన్‌వాడి కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్, పైవ్రేట్ పాఠశాలలో, జూనియర్ కళాశాలలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన నాలుగు లక్షల 70 వేలకు పైగా ఉన్న పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను పంపిణి చేయాలన్నారు.జిల్లాలో మొత్తం 5,20,000 నులి పురుగుల నివారణ మాత్రలను అందుబాటులో ఉంచుకున్నామని తెలిపారు. ఆశా వర్క ర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, స్వయం సహాయక బృందాలు, తల్లిదండ్రులు ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్స్ , రైల్వే స్టేషన్, ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేసి ఏఎన్ఎంల పర్యవేక్షణలో మాత్రలను పంపిణీ చేయాలన్నారు. ఆల్బెండజోల్ మందు విషయంలో తల్లిదండ్రులు అపోహలు వీడాలని ఇది పూర్తి సురక్షితమని ఆయన తెలిపారు. అలాగే మండల,జిల్లా స్థాయిలలో ర్యాలీ, మారతాన్ రన్ వంటి అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.ఎక్కడా మందుల కొరత రాకుండా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి శాఖను ఆదేశించారు. అలాగే గోడ పుత్రులను పాంప్లీట్లను తయారు చేయించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఐసిడిఎస్, విద్యాశాఖ, కమిషనర్లు, ఎంపీడీవోలు సిడిపివోలు, డిఆర్డిఏ అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై రూపొందించిన వాల్‌పోస్టర్ల ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 10వ తేదీ “జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం”(డివార్మింగ్ డే)సందర్భంగా జిల్లాలో నాలుగు లక్షల 70 వేలకు పైగా పిల్లలకు నులిపురుగుల మందుల ఉచిత పంపిణీ
వైయస్సార్ జిల్లా, ఫిబ్రవరి 7:నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఈనెల ఫిబ్రవరి 10తేదీన జిల్లాలో ఉన్న 1నుంచి 19 సంవత్సరాల వయసు లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులు సూచించారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో నులి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై (జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్) సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు.
ఆర్టీసీ బస్టాండ్స్ , రైల్వే స్టేషన్, ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేసి ఏఎన్ఎంల పర్యవేక్షణలో మాత్రలను పంపిణీ చేయాలన్నారు. ఆల్బెండజోల్ మందు విషయంలో తల్లిదండ్రులు అపోహలు వీడాలని ఇది పూర్తి సురక్షితమని ఆయన తెలిపారు. అలాగే మండల,జిల్లా స్థాయిలలో ర్యాలీ, మారతాన్ రన్ వంటి అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.ఎక్కడా మందుల కొరత రాకుండా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి శాఖను ఆదేశించారు. అలాగే గోడ పుత్రులను పాంప్లీట్లను తయారు చేయించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఐసిడిఎస్, విద్యాశాఖ, కమిషనర్లు, ఎంపీడీవోలు సిడిపివోలు, డిఆర్డిఏ అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
