పేదల రక్తం తాగుతున్న ప్రభుత్వాలు
దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మోదీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నియోజకవర్గం కేంద్రంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, అర్థం పర్థం లేని జీఎస్టీ విధానంకు నిరసనగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేశాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ళ దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువాల దుర్గాప్రసాద్ మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు అవసరమయ్యే పాలడబ్బా నుంచి చనిపోయిన వ్యక్తికి స్మశానంలో చేసే కర్మకాండల వరకూ అన్నింటిపైనా జీఎస్టీ విధించి ప్రజల రక్తాన్ని మోదీ ప్రభుత్వం తాగుతోంది. దేశంలోని అన్ని సమస్యలపైనా ప్రజల తరఫున గళం వినిపిస్తున్నది, ప్రజల తరఫున కొట్లాడుతున్నది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. అఖరకు ఆస్పత్రులు, టూరిజంలో భాగంగా చేసే విడిది సదుపాయాలు, తినుబండారాలపై కూడా జీఎస్టీ విధించి సామాన్యులపై మోయలేని భారాన్ని మోదీ ప్రభుత్వం వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సమాన్యుడు చితికిపోతున్నాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2012 – 13లో ఒక మెట్రిక్ టన్ ఎల్పీజీ గ్యాస్ 855 యూ ఎస్ డాలర్లు ఉన్నసమయంలో కూడా వంట గ్యాస్ ను రూ. 400 నుంచి రూ. 450 మధ్యలోనే అందించింది. నేడు మెట్రిక్ టన్ ఎల్పిజి గ్యాస్ ధర 762 యూ ఎస్ డాలర్లు ఉన్నప్పటికీ.. సిలండర్ ధర రూ. 1100గా ఉంది. మోదీ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని డబ్బు రూపంలో ఎలీ పీల్చేస్తోందో చెప్పేందుకు ఇదొక్క నిదర్శనం చాలు.రాష్ట్రంలో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ప్రజా అవసరాలు కూడా వ్యాపార కోణంలో చూస్తున్నారు తప్ప.. సామాన్యుడిని బతికించేలా ఆలొచించడం లేదు. సామాన్యుడి సంక్షేమాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చూడడం లేదు.మోదీ ప్రభుత్వం విధించే పన్నుల వల్ల వచ్చే సొమ్ములు బడాబాబుల సంస్థలకు సబ్సిడీల రూపంలో వెళుతున్నాయి. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారనే శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ రూపంలో వెంటాడుతున్నారు. ఇలాంటి తోక ఊపుళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం భయపడరు అని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తిరిగి రాజ్యాంగయుతంగా ప్రజా సంక్షేమ పాలనను అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో , కొప్పెర ఉపేందర్, కార్పొరేటర్లు సైదులు నాయక్, పల్లెబోయిన చంద్రం, మాజీ కౌన్సిలర్లు వడ్డెబోయిన నర్సింహారావు, పాలకుర్తి నాగేశ్వరావు, రఘునాథపాళెం మండల బాధ్యులు దిదిశాల చిన్న వెంకటేశ్వర్లు, హరిసింగ్, కొంటెముక్కల నాగేశ్వరరావు, గజ్జి సూరిబాబు, వెనిగళ్ళ సత్యనారాయణ, సాధు శంకర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, ఖమ్మం పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్, మైనార్టీ నాయకులు సయ్యద్ గౌస్, అబ్బాస్, మహమూద్, ఆహాద్ ముజాహిద్, శ్రీశైలం యాదవ్, బాణాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మోదీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నియోజకవర్గం కేంద్రంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, అర్థం పర్థం లేని జీఎస్టీ విధానంకు నిరసనగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేశాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ళ దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువాల దుర్గాప్రసాద్ మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు అవసరమయ్యే పాలడబ్బా నుంచి చనిపోయిన వ్యక్తికి స్మశానంలో చేసే కర్మకాండల వరకూ అన్నింటిపైనా జీఎస్టీ విధించి ప్రజల రక్తాన్ని మోదీ ప్రభుత్వం తాగుతోంది. దేశంలోని అన్ని సమస్యలపైనా ప్రజల తరఫున గళం వినిపిస్తున్నది, ప్రజల తరఫున కొట్లాడుతున్నది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. అఖరకు ఆస్పత్రులు, టూరిజంలో భాగంగా చేసే విడిది సదుపాయాలు, తినుబండారాలపై కూడా జీఎస్టీ విధించి సామాన్యులపై మోయలేని భారాన్ని మోదీ ప్రభుత్వం వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సమాన్యుడు చితికిపోతున్నాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2012 – 13లో ఒక మెట్రిక్ టన్ ఎల్పీజీ గ్యాస్ 855 యూ ఎస్ డాలర్లు ఉన్నసమయంలో కూడా వంట గ్యాస్ ను రూ. 400 నుంచి రూ. 450 మధ్యలోనే అందించింది. నేడు మెట్రిక్ టన్ ఎల్పిజి గ్యాస్ ధర 762 యూ ఎస్ డాలర్లు ఉన్నప్పటికీ.. సిలండర్ ధర రూ. 1100గా ఉంది. మోదీ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని డబ్బు రూపంలో ఎలీ పీల్చేస్తోందో చెప్పేందుకు ఇదొక్క నిదర్శనం చాలు.రాష్ట్రంలో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ప్రజా అవసరాలు కూడా వ్యాపార కోణంలో చూస్తున్నారు తప్ప.. సామాన్యుడిని బతికించేలా ఆలొచించడం లేదు. సామాన్యుడి సంక్షేమాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చూడడం లేదు.మోదీ ప్రభుత్వం విధించే పన్నుల వల్ల వచ్చే సొమ్ములు బడాబాబుల సంస్థలకు సబ్సిడీల రూపంలో వెళుతున్నాయి. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారనే శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ రూపంలో వెంటాడుతున్నారు. ఇలాంటి తోక ఊపుళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం భయపడరు అని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తిరిగి రాజ్యాంగయుతంగా ప్రజా సంక్షేమ పాలనను అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో , కొప్పెర ఉపేందర్, కార్పొరేటర్లు సైదులు నాయక్, పల్లెబోయిన చంద్రం, మాజీ కౌన్సిలర్లు వడ్డెబోయిన నర్సింహారావు, పాలకుర్తి నాగేశ్వరావు, రఘునాథపాళెం మండల బాధ్యులు దిదిశాల చిన్న వెంకటేశ్వర్లు, హరిసింగ్, కొంటెముక్కల నాగేశ్వరరావు, గజ్జి సూరిబాబు, వెనిగళ్ళ సత్యనారాయణ, సాధు శంకర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, ఖమ్మం పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్, మైనార్టీ నాయకులు సయ్యద్ గౌస్, అబ్బాస్, మహమూద్, ఆహాద్ ముజాహిద్, శ్రీశైలం యాదవ్, బాణాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
