ఈ తరం యువతకు ఆదర్శనీయం.. అల్లూరి

కడప, జూలై 4 : స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు ఈ తరం యువతకు ఆదర్శనీయం అని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. “అజాది కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా… మంగళవారం కలెక్టర్ స్పందన హాలులో శ్రీ అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు.. జేసీ గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్వో గంగాధర్ గౌడ్ లు ముఖ్య అతిధులతో హాజరయ్యారు. ఈ జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ… నేటి సమాజానికి.. అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆదర్శణీయం అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరువరాదని, ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని.. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, అందుకోసం తన ప్రాణాలర్పించిన యోధుడన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడన్నారు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొట్టి వీర మరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. ప్రతి ఏడాది జులై 4వ తేదీని అల్లూరి సీతారామరాజు జయంతిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించిండం అభినందనీయం అన్నారు. అందులో భాగంగానే.. ప్రతిఏడాది జూన్ 27వ తేదీ నుండి జూలై 4వ వరకు అన్ని విద్య సంస్థల్లో పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యాసరచన, వక్తృత్వపు పోటీలను నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. అంతకుముందు సమావేశానికి ఆహాజరైన ముఖ్య అతిధులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ప్రభాకర్ రెడ్డి, జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖాధికారి మల్లికార్జున, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ తరం యువతకు ఆదర్శనీయం.. అల్లూరి

కడప, జూలై 4 : స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు ఈ తరం యువతకు ఆదర్శనీయం అని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు.

“అజాది కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా… మంగళవారం కలెక్టర్ స్పందన హాలులో శ్రీ అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు.. జేసీ గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్వో గంగాధర్ గౌడ్ లు ముఖ్య అతిధులతో హాజరయ్యారు.

ఈ జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ… నేటి సమాజానికి.. అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆదర్శణీయం అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరువరాదని, ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని.. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, అందుకోసం తన ప్రాణాలర్పించిన యోధుడన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడన్నారు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొట్టి వీర మరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు.

ప్రతి ఏడాది జులై 4వ తేదీని అల్లూరి సీతారామరాజు జయంతిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించిండం అభినందనీయం అన్నారు. అందులో భాగంగానే.. ప్రతిఏడాది జూన్ 27వ తేదీ నుండి జూలై 4వ వరకు అన్ని విద్య సంస్థల్లో పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యాసరచన, వక్తృత్వపు పోటీలను నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.

అంతకుముందు సమావేశానికి ఆహాజరైన ముఖ్య అతిధులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ ప్రభాకర్ రెడ్డి, జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖాధికారి మల్లికార్జున, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts