మిషన్ భగీరథ త్రాగునీటి పై ఆరా తీసి మూడు నెలలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్
ములుగు జిల్లా ప్రతినిధి, జనవరి 31 (భారత శక్తి) : ఇంటింటికి వెళ్లి మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా పై ఆరా తీయాలని, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు నెలలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ వాటర్ సరాఫర పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు వేసవికాలం సమీపిస్తున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మిషన్ భగీరథ వాటర్ సప్లై గురించి అడిగి తెలుసుకుని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు నెలలకు గాను ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం అనుభవంలో దృష్టి లో పెట్టుకొని వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సమీపంలో ఉన్న బావులు, చెరువులు, హ్యాండ్ పంపులు, లోకల్ బోర్వెల్స్, ట్యూబ్ వెల్స్, వ్యవసాయ బోర్లు గుర్తించి ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కే సురేష్ మిషన్ భగీరథ సి ఈ వరంగల్, మల్లేశం ఎస్ ఈ, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు ఏఈలు, 9 మండలాల ఎంపీడీవోలు, ఎంపీలు, జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా ప్రతినిధి, జనవరి 31 (భారత శక్తి) : ఇంటింటికి వెళ్లి మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా పై ఆరా తీయాలని, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు నెలలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ వాటర్ సరాఫర పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు వేసవికాలం సమీపిస్తున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మిషన్ భగీరథ వాటర్ సప్లై గురించి అడిగి తెలుసుకుని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు నెలలకు గాను ప్రణాళికలు రూపొందించుకోవాలని
అధికారులను ఆదేశించారు.
గత సంవత్సరం అనుభవంలో దృష్టి లో పెట్టుకొని వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సమీపంలో ఉన్న బావులు, చెరువులు, హ్యాండ్ పంపులు, లోకల్ బోర్వెల్స్, ట్యూబ్ వెల్స్, వ్యవసాయ బోర్లు గుర్తించి ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో కే సురేష్ మిషన్ భగీరథ సి ఈ వరంగల్, మల్లేశం ఎస్ ఈ, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు ఏఈలు,
9 మండలాల ఎంపీడీవోలు, ఎంపీలు, జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
