సీతారామంజనేయస్వామి ఆలయంలో పొంగులేటి ప్రత్యేక పూజలు
పెనుబల్లి: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పెనుబల్లి మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కర్రాలపాడు గ్రామంలో 16రోజుల పండుగ సందర్భంగా సీతారామంజనేయస్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటికి ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పొంగులేటి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా నాయకులు మట్టా దయానంద్ తదితరులు ఉన్నారు.