పీఎస్ఆర్ గార్డెన్స్ లో జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ములుగు జిల్లా ప్రతినిధి :జిల్లా గ్రామీణాభివృద్ధి – ఈజీ ఎం ఎం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా నేపథ్యంలో సోమవారం పీఎస్ఆర్ గార్డెన్స్ చల్వాయిలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పర్శిలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన 50 ప్రత్యేకమైన డైరెక్ట్ ప్లేస్మెంట్ ఇచ్చే కంపెనీలకు, ప్రత్యేకమైన స్టాల్స్ ను ఏర్పాటు చేసి, మరియు 30 శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలుపుతూ జాబ్ మేళాకు వచ్చే యువతకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ, వచ్చిన యువతకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. నేడు నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు హాజరై వివిధ కంపెనీ లలో ఉద్యోగం పొందే విధంగా, మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డిపిఎం ఏ సతీష్ , ఏ పీఎం డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పీఎస్ఆర్ గార్డెన్స్ లో జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ములుగు జిల్లా ప్రతినిధి :జిల్లా గ్రామీణాభివృద్ధి – ఈజీ ఎం ఎం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా నేపథ్యంలో సోమవారం పీఎస్ఆర్ గార్డెన్స్ చల్వాయిలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పర్శిలించి, అధికారులకు తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన 50 ప్రత్యేకమైన డైరెక్ట్ ప్లేస్మెంట్ ఇచ్చే కంపెనీలకు, ప్రత్యేకమైన స్టాల్స్ ను ఏర్పాటు చేసి, మరియు 30 శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలుపుతూ జాబ్ మేళాకు వచ్చే యువతకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ, వచ్చిన యువతకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
నేడు నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు హాజరై వివిధ కంపెనీ లలో ఉద్యోగం పొందే విధంగా, మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డిపిఎం ఏ సతీష్ , ఏ పీఎం డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts