Eating Style Personality: తినే విధానాన్ని బట్టి పర్సనాలిటీ కనుక్కోవచ్చని మీకు తెలుసా?

ఆహారంలో తినడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కొంతమంది వేగంగా తినేస్తే.. ఇంకొంతమంది నెమ్మదిగా తినేందుకు ఇష్టపడతారు. ఇలా విభిన్న రకాలుగా తింటూ ఉంటారు ప్రజలు. అయితే, తినే స్టైల్ బట్టి ఒక వ్యక్తి ఎలాంటి వాడో కనుక్కోవచ్చని మీకు తెలుసా?

Eating Style Personality: తినే విధానాన్ని బట్టి పర్సనాలిటీ కనుక్కోవచ్చని మీకు తెలుసా?

మీరు ఎలా కూర్చుంటారు. ఎలా నవ్వుతారు లేదా కలత చెందినప్పుడు మీ ముఖంలో ఎలాంటి భావాలు పలుకుతాయి. ఇలా మీ వ్యక్తిత్వం గురించి చెప్పకనే చెప్పే అంశాలెన్నో. కానీ తినే విధానం కూడా ఓ వ్యక్తి వ్యక్తిత్వం గురించి చెబుతుందని మీకు తెలుసా? మీరు లేదా మీకు తెలిసిన వ్యక్తుల పర్సనాలిటీ గురించి ఆహారం తినే విధానం ఆధారంగా ఎలా కనుక్కోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

స్లో ఈటర్స్
నెమ్మదిగా, తీరికగా తినేవారికి సహనం ఎక్కువ. ఓపిక నశించే సందర్భాలు అరుదు. వీరు ఎప్పుడూ తొందరపడరు. ప్రతి ముద్దను ఆస్వాదిస్తారు. వారి పూర్తి శ్రద్ధ, శక్తిని తినడంపైనే కేంద్రీకరిస్తారు. కానీ ఇలాంటి వ్యక్తులు తమ వర్క్ లైఫ్‌లో ఇలాంటి విధానాన్నే అనుసరిస్తారు. ఈ విధానం సమయపాలన పాటించే వారిని చికాకుపెడుతుంది.

ఫాస్ట్ ఈటర్స్
ఇలాంటి వాళ్లు పక్కవాళ్లు లంచ్ బాక్స్ తెరిచేలోపే కచ్చితంగా సగం తినేస్తారు. మీకు తెలిసినవాళ్లు అలాంటి వాళ్లే అయితే వాళ్లు మల్టీ టాస్కింగ్‌లో నిపుణులు. వీరు ఎల్లప్పుడూ తమ పనిని సమయానికి లేదా కొన్నిసార్లు నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేస్తారు. ఇలాంటి వ్యక్తులు అధిక పోటీ భావాన్ని కలిగి ఉంటారు. దీని కారణంగా వీరు జీవితంలోని చిన్నచిన్న అమూల్యమైన క్షణాలను తరచుగా కోల్పోతారు. సంతోషాలను ఆస్వాదించలేరు.

క్యూరియస్/డేరింగ్ ఈటర్స్
తినడానికి ముందే ఏమి తినాలి? ఏమి తినకూడదు? ఎప్పుడు తినాలి? ఎలా తినాలి? వంటి ప్రశ్నలు అడిగేవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఓడిపోతామని చాలా భయపడతారు., కానీ అదే సమయంలో వారు చాలా ప్రశ్నలు కూడా అడుగుతారు.

పికీ ఈటర్
భోజనం చేస్తున్నప్పుడు ప్లేట్‌లోని వంటకాలు ఎలా ఉన్నాయ్.. వాసన, రంగు ఎలా ఉంది.. ఏదైనా తక్కువ లేదా ఎక్కువ అయిందా.. ఇలా ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తారు. వీళ్లు పదే పదే తమకు నచ్చిన పదార్థాలు తినడానికి ఇష్టపడతారు. ఇక వీరు తన చుట్టూ ఉన్నవారిని కంట్రోల్ చేయాలని మనస్తత్వం కలిగి ఉంటారు. పరిశీలనాత్మక, ఆత్మరక్షణ ధోరణి ఎక్కువ. స్నేహపూర్వకంగా ఉంటారు. అదనపు బాధ్యతలను తీసుకోవడానికి వెనుకాడరు. ఎమోషనల్‌ సెన్సిటివ్‌‌నెస్ ఎక్కువ. వీరు తమ ఉద్యోగాన్ని ఇష్టపడటమే కాకుండా తమకు ఇష్టమైన వ్యక్తుల కోసం కూడా సులభంగా సమయాన్ని కేటాయిస్తారు. కానీ, కొన్నిసార్లు ప్రతిదీ చేయాలనే కోరిక కారణంగా వ్యక్తిగత సమయాన్ని కోల్పోతారు. సమయానికి తమ పనిని పూర్తి చేయలేరు.

సోషల్ ఈటర్
కొంతమంది తాము ఇంతకు ముందు రుచి చూసిన వంటకాలనే తింటారు. అదే సమయంలో ఆహారంతో ప్రయోగాలు చేయడానికి వెనుకాడరు కొందరు. వీరు వివిధ రకాల వంటకాలను రుచి చూస్తారు. ఇలాంటి వ్యక్తులు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్లి పని చేయడంలో, జీవితంలో రిస్క్ తీసుకునేందుకు కొంచెం కూడా భయపడరు. జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు. ధైర్యసాహసాలు ఎక్కువే.

ఐసోలేషనిస్ట్/ఇండిపెండెంట్ ఈటర్
కొంతమంది తమ ఆహారాన్ని నమిలేటప్పుడు చాలా శబ్దం చేస్తారు. ఆ వ్యక్తి ఆహారం తింటున్నట్లు దూరం నుంచైనా కనిపెట్టవచ్చు. వీరి ఈ అలవాటు సాధారణంగా అందరినీ చికాకుపెడుతుంది. ఇలాంటి వారు నోటిలో ఆహారం పెట్టుకుని మాట్లాడుతుంటారు. వీరు స్వతహాగా బహిర్ముఖులు మాత్రమే కాదు. ఇతరులు వారి గురించి ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోరు. అయితే, ఈ వ్యక్తులు వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే)

About The Author

Related Posts