మహోన్నత ఆశయంతో మొదలైన షీ టీమ్స్..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

- మహిళల భద్రతకు ఒక నమ్మకమైన దిశా నిర్దేశం.. 
- సమస్యలతో సతమతం అవుతున్న వ్యవస్థ.. 
- సిబ్బంది కొరత ముఖ్యమైన సమస్య.. 
- ఉన్నతాధికారుల ఒత్తిడితో సతమతం అవుతున్న వైనం.. 
- కొందరిలో నిర్లక్షధోరణి మరో తీవ్ర సమస్యగా అభిప్రాయాలు.. 
- కేసుల తాకిడికి తట్టుకోలేకపోతున్న షీ టీమ్ మహిళా పోలీసులు.. 
- రాజకీయ జోక్యంతో మరింత కృంగుబాటు తనం.. 
- ఎఫ్.ఐ.ఆర్. నమోదులకు లంచాలు అడుగుతున్నారని విమర్శలు.. 
- కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న సాంకేతికత లోపం.. 
- అధునాతన సాధనాలు లేకపోవడంతో నిర్వీర్యం అవుతున్న దౌర్భాగ్యం.. 
- షీ టీమ్స్ కి తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "

download (1)

మనం ఆదినుంచి పూజిస్తున్న ఆదిపరాశక్తి ఒక మహిళ.. త్రిమూర్తులను తన ఒడిలో లాలించిన మాతృమూర్తి ఒక మహిళ.. మనకు జన్మనిచ్చేది ఒక మహిళ.. మనల్ని ప్రేమించి మనసు ఇచ్చేది ఒక మహిళ.. మనకు రాఖీ కట్టి మన బాగు కోరుకునేది ఒక మహిళ.. మన కడుపునా పుట్టి మనకోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేది కూడా ఒక మహిళే.. అలాంటి మహోన్నతమైన స్థానాన్ని అలంకరించిన మహిళల పట్ల ఈ సమాజం ఎలా ప్రవర్తిస్తోంది..? ఆ సమాజంలో మనం కూడా ఒక భాగమే.. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..  బయటకు వస్తే మహిళకు రక్షణ కరువైన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది.. అదే షీ టీమ్స్.. 

Read More మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజులకే, అంటే 2014లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగమే షీ టీమ్స్. ఆ సమయంలో ఈ కాన్సెప్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పబ్లిక్ ప్రదేశాల్లో వేధింపులు, ఈవ్ టీజింగ్, సైబర్ హరాస్‌మెంట్ వంటి నేరాలను అరికట్టడంలో వీరు ముందుకు రావడం మహిళలకు ఒక రకమైన భరోసాను ఇచ్చింది.

Read More నేటి భారతం :

ఆరంభంలో ఎన్నెన్నో విజయాలు అందుకున్న షీ టీమ్ విభాగం :

Read More నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

షీ టీమ్స్ ఏర్పడిన తర్వాత కాలేజీలు, బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్లలో సూక్ష్మ నిఘా పెరిగింది. సోషల్ మీడియా ద్వారా అనామక ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభమైంది. ఈవ్ టీజింగ్, వేధింపుల కేసుల్లో నేరస్తులను పట్టుకొని కౌన్సెలింగ్, శిక్షలు విధించడం ద్వారా సమాజానికి సందేశం ఇచ్చారు. ఒక హెచ్చరిక చేశారు..  అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థినుల్లో ధైర్యం పెంచారు.

Read More హిందువులు బొందు గాళ్లు అన్నోళ్లు కాలగర్భంలో కలిసిపోయారు

కానీ ఈ విభాగంలో సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. కాలక్రమేణా షీ టీమ్స్ పనితీరు గురించి అనేక అనుమామానాలు తలెత్తాయి.. సిబ్బంది కొరత ఒక సమస్యగా మారిపోయింది.. పెరుగుతున్న కేసుల భారం తట్టుకోవడానికి సరిపడా బలగం లేకపోవడం. టెక్నాలజీ పరిమితులు ఏర్పడటం.. సైబర్ హరాస్‌మెంట్ కేసుల్లో ఆధునిక పరికరాలు, శిక్షణ లోపించడం. ఫిర్యాదుదారుల భయం కూడా ఒక కారణంగా మారింది.. సమాజ ఒత్తిడి వల్ల మహిళలు ఇంకా వెనుకడుగు వేయడం.

Read More కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాలలో విజయం సాధిస్తారు

ఈ విభాగంపై అవినీతి ఆరోపణలు రావడం జరుగుతోంది.. జరిగిన కొన్ని సంఘటనలు షీ టీమ్స్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేశాయి. ఇక రాజకీయ ఒత్తిడి కారణంగా అసలైన నేరస్తులపై కేసులు నమోదు కాకపోవడం అనేది జరుగుతోంది.. ఇక ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో లంచాలు, సర్దుబాట్లు జరిగాయని ఎంతోమంది బాధితులు ఆరోపణలు సైతం గుప్పించారు.. కాగా కొన్ని కేసుల్లో బాధితుల కన్నా నిందితులకు మద్దతుగా వ్యవహరించారని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.. 

Read More తుది మెరుగులు దిద్దుకుంటున్న బ‌మృక్‌నుద్దౌలా చెరువు

మరి భవిష్యత్తులో ఏమి చేయాలి? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.. కొందరు మేధావులు, విశ్లేషకులు కొన్ని సూచనలు చేస్తున్నారు.. ప్రభుత్వం షీ టీమ్స్‌కు మరింత బడ్జెట్, సిబ్బంది, టెక్నాలజీ అందించాలి. స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పడి, కేసుల దర్యాప్తులో పారదర్శకత ఉండాలి. పాఠశాలలు, కాలేజీలు, వర్క్‌ప్లేస్‌లలో అవగాహన కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాలి. ఇక సమాజం కూడా తమ వంతుగా మహిళల భద్రతను కుటుంబ, సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..  ఈ విభాగంలో అవినీతి ముద్రపడిన వారిని వెంటనే తొలగించాలి.. 

Read More రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

అయితే షీ టీమ్స్ ఉద్దేశ్యం గొప్పదే అయినా, అవినీతి, నిర్లక్ష్యం, సిబ్బంది కొరత వంటి సమస్యలు దీనిపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. మహిళల భద్రతను నిజంగా సాధించాలంటే స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ, ఆధునిక టెక్నాలజీ, నిర్వహణలో పారదర్శకత తప్పనిసరి అనేది నిర్విదాంశం..

Read More స్థానిక ఎన్నికల బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం

About The Author