ఆకలిని తీర్చడం కాదు ప్రాణాలు హరిస్తుంది..

టేస్టింగ్ సాల్ట్ ఉపయోగిస్తూ అక్రమ దందా చేస్తున్న హోటళ్లు..

  • ఆరోగ్యశాఖ నియంత్రణ లేదు.. విచ్చలవిడిగా వినియోగం.
  • హైదరాబాద్ నగరంలో వ్యాప్తి చెందుతున్న అజినొమొటో వినియోగం. 
  • నిషేధించాల్సిన ప్రభుత్వం మిన్నకుండి పోతోంది..
  • చైనా నుంచి దిగుమతి అవుతున్న టేస్టింగ్ సాల్ట్.. 
  • వాస్తవానికి ద్రాక్ష తోటలకు పురుగు ముందుగా వాడతారు.. 
  • పురుగు మందు పేరుతో దిగుమతి చేసుకుంటూ ఆహార పదార్ధాలలో వినియోగం..
  • రుచి కోసం వాడుతున్నాం అంటున్న హోటల్స్ యాజమాన్యం.. 
  • స్ట్రీట్ ఫుడ్స్ లో మంరింత ఎక్కువుగా వాడుతున్నట్లు సమాచారం.. 
  • ప్రస్తుతం హై లెవల్ రెస్టారెంట్స్ లో కూడా వినియోగిస్తున్నారు..!
  • అసలు దీనిని ఎందుకు కట్టడి చేయడం లేదు అన్నది ప్రశ్నార్థకం.. 
  • తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించక పోతే పెను ప్రమాదం.. 
    " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు.. 

WhatsApp Image 2025-08-14 at 3.55.43 PM

నగరంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా, అదే విధంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఫాస్ట్ ఫుడ్స్ ని ఎక్కువుగా ఇష్టపడుతుంటారు.. దీనిని అవకాశంగా చేసుకున్న ఫుడ్ సెంటర్స్ తాము తయారు చేసే ఫాస్ట్ ఫుడ్స్ లో రుచి కోసం అజినొమొటో కలుపుతున్నారు.. అంటే టేస్టింగ్ సాల్ట్ కలుపుతున్నారు.. నిజానికి ఈ సాల్ట్ ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.. వాస్తవం ఏమిటంటే ఈ సాల్ట్ ని అరటి తోటలకు వాడతారు..  ఇందులో అనేక రసాయనాలు మిళితమై ఉంటాయి.. అరటి తోటలకోసం దిగుమతి చేసుకుంటున్న ఈ అజినొమొటోను అక్రమంగా కొంతమంది  ఫుడ్ సెంటర్స్ కు తరలిస్తున్నారు.. ఈ సాల్ట్ ఆహార పదార్ధాలలో వినియోగిస్తే అత్యంత రుచి వస్తుంది.. అందుకనే రెస్టారెంట్లు, వీధి ఫుడ్ సెంటర్లు మరీ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఈ సాల్ట్ ని ఎక్కువుగా వినియోగిస్తున్నారు.. చట్ట ప్రకారం ఈ సాల్ట్ ని ఆహార పదార్ధాలలో  వినియోగించడం నేరం అవుతుంది.. నిజానికి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ సాల్ట్ ని ఆదేశం నిషేధించింది..  ఎవరైనా ఆహార పదార్ధాలలో వినియోగించినట్లు తెలిస్తే వారికి ఉరి శిక్ష విదిస్తుంది చైనా ప్రభుత్వం.. మరి భారత దేశంలో  ఎలా వినియోగిస్తున్నారు..? కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ టేస్టింగ్ సాల్ట్ ని ఆహార పదార్ధాలలో వినియోగించకుండా  ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు..? దీని వెనుక పెద్ద ఎత్తున మాఫియా పనిజేస్తోందని సమాచారం.. కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు కూడా  తెలుస్తోంది.. టేస్టింగ్ సాల్ట్ వినియోగంతో మనుషుల్లో అనేక రుగ్మతలు కలుగుతున్నాయి.. చివరికి ప్రాణాలు కూడా పోతున్నాయి..  కనీసం ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అజినొమొటోను దేశం నుంచి తరిమెయ్యాలని  సగటు మనిషి  ప్రాణాలను రక్షించాలని, సాల్ట్ వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " డిమాండ్ చేస్తోంది.. 

Read More మహిళలను మనుషులుగా చూడండి..

స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ : అజినోమోటో.. ఫాస్ట్‌ ఫుడ్‌ లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా..? వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.. మీరు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ వెయ్యొద్దని  ఫుడ్ సెంటర్స్ వారికి చెప్పాలి.. 

Read More నేటి భారతం

అయితే ఈ రోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ను బాగా ఇష్టపడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ లో అజినమోటో అనే సాల్ట్ లాంటి పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఆహారాలకు మరింత ప్రత్యేక రుచిని అందించటం కోసం అజిన్‌మోటోను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More నేటి భారతం

అజినోమోటో…దీనినే చైనా ఉప్పు అని కూడా పిలుస్తారు. రుచి కోసం అనేక వంట‌ల్లో అజినోమోటో విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు. చైనా నుంచి దిగుమతి అయిని ఈ ఉప్పు.. మ‌న దేశంలో సైతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా బ‌య‌ట దొరికే ఫాస్ట్ ఫుడ్స్‌లో అజినోమోటోను రుచి, వాస‌న‌ కోసం విప‌రీతంగా వాడుతుంటారు. ఆధునిక జీవనశైలిలో మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం. అలాంటి ఆహారాలకు మరింత ప్రత్యేక రుచిని అందించటం కోసం అజిన్‌మోటోను ఉపయోగిస్తుంటారు. ఇక ఇప్పుడిది మనందరి వంట గదుల్లోకి కూడా వ‌చ్చేసింది. అయితే,  వంట‌ల‌కు రుచి పెంచే ఈ అజినోమోటో వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

Read More నేటి భారతం

అజినోమోటో అంటే ఏమిటి? : 
అజినోమోటో ఒక రకమైన రసాయనం. దీనినే ఎం.ఎస్.జీ. అని కూడా అంటారు. ఎం.ఎస్.జీ. అనేది మోనోసోడియం గ్లుటామేట్. ఇది ప్రొటీన్‌లో భాగం. దీనిని అమినో యాసిడ్ అని కూడా అంటారు. అజినోమోటోను 1909లో జపనీస్ శాస్త్రవేత్త కికునావో అకెడా కనుగొన్నారు.

Read More జాతికి సవాలు విసురుతున్న బాలకార్మిక వ్యవస్థ..

అజినోమోటో ఎలాంటి ఆహారంలో ఉపయోగిస్తారు? : 
నూడుల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్, సూప్ వంటకాలు వంటి చాలా చైనీస్ వంటకాలలో అజినోమోటోను ఉపయోగిస్తారు. అలాగే, దీనిని పిజ్జా, బర్గర్, మ్యాగీ మసాలాలు, జంక్ ఫుడ్, టొమాటో సాస్, సోయా సాస్, చిప్స్‌లో కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు అజోనోమోటో  తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉన్నాయో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.. 

Read More నేటి భారతం

నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది : 
చైనీస్ వంటకాల్లో ఉపయోగించే అజినోమోటో నాడీ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తుంది. ఇందులోని గ్లుటామిక్ యాసిడ్ మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఎక్కువగా ఉంటే మెదడుకు ప్రమాదం ఏర్పడుతుంది.

Read More నేటి భారతం

బరువు పెరగడం : 
నేడు చాలా మంది జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. రెండో విషయం ఏమిటంటే నేటి ఆహారపు అలవాట్లు దిగజారిపోయాయి. కరకరలాడే ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమోటోను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో, అజినోమోటో మీ ఆకలిని పెంచుతుంది. దీనివల్ల పదే పదే తినడం వల్ల ఊబకాయం వస్తుంది.

Read More నేటి భారతం

గర్భిణీ స్త్రీలకు ప్రమాదం : 
గర్భిణీ స్త్రీలు చైనీస్ ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. దీనికి ప్రధాన కారణం అజినోమోటో. ఎందుకంటే ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో సోడియం ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది. ఇది శిశువుపై కూడా ప్రభావం చూపుతుంది.

Read More నేటి భారతం

అధిక రక్తపోటు సమస్య : 
చైనీస్ ఆహారంలో అజినోమోటో రక్తపోటు సమస్యను కలిగిస్తుంది. బహుశా, మీరు ఇప్పటికే రక్తపోటు పేషెంట్ అయితే, అజినోమోటో ఫుడ్ తినకండి. దీని వల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది.

Read More విద్య పేరుతో దోపిడీ..

నిద్రలేమి, మైగ్రేన్లు : 
మీకు నిద్ర, మైగ్రేన్ సమస్యలు ఉంటే అజినోమోటో ఒక ప్రధాన కారణం కావచ్చు. ఇది నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. అలాగే అజినోమోటో ఫుడ్ తినడం వల్ల రోజంతా అలసటగా ఉంటుంది.

ఇతర దేశాలకు మరీ ముఖ్యంగా భారతదేశానికి అజినోమోటోను సరఫరా చేసే చైనా దేశం తమ దేశంలో ఆహారంలో వినియోగానికి చెక్ పెడుతున్నప్పుడు..  కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పుడు.. ఇదంతా తెలిసి కూడా భారతదేశంలో ఆహార పదార్ధాలలో వినియోగానికి ప్రభుత్వం  ఎలా అనుమతి ఇస్తోంది..? వైద్య రంగంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన భారత దేశంలోనే ఇలాంటి వినాశనం జరుగుతుంటే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి..? దీనివెనుక ఉన్న బలమైన కారణం ఏమిటి..? అజినోమోటోను నిషేధించకపోతే భారతదేశం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు.. ఈ టేస్టింగ్ సాల్ట్ ను సంపూర్ణంగా తరిమేయడానికి కంకణం కట్టుకుంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " మా పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కండి.. ఆరోగ్య భారత్ ను నిర్మిద్దాం.. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన  చర్యలు తీసుకోకపోతే దీనిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం..

About The Author