హాస్య నటుడే రాజైతే..!

తెనాలి రామకృష్ణుడు, బీర్బల్, నస్రుద్దీన్, బస్టర్ కీటన్, ఎవరంటే ఠకీమని చెప్పగలం. కాని వారి వారి కాలంలోని ఏలికలు ఎవరంటే మాత్రం తలగోక్కోవాల్సిందే! “కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరీ..!” అని వేడుకోవాల్సి ఉంటుంది మరి. నువ్వు నాకు అదనంగా ఏమిస్తావు? నేను నిన్నే ఎందుకు? పెళ్లాడాలని అమ్మాయి అడిగితే, “నవ్విస్తానన్నాడట!” ఆ ప్రేమికుడు. అతన్ని ఆ అమ్మాయి పెళ్ళాడిందో లేదో తెలియదు గాని, జీవితాంతం నవ్వుతూ బతకగలిగితే అంతకన్నా ఎవరికైనా మరేం కావాలి? “నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును..” అంటాడు జాషువా ‘నవ్వుతూ బతకాలిరా! తమ్ముడూ నవ్వుతూ చావాలిరా! అని కోరుకోనిది ఎవరు? నవ్వితే కడుపు ఉబ్బుతుంది. ఒక్కొక్కసారి పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుతాం! నవ్వు విషయంలో ఇహ చాల్లే.. అనే మాట రాదు.. తలుచుకొని.. తలుచుకొని నవ్వుతాం! ఇది చాలదు? జీవితానికి మణులూ, మాన్యాలూ కావాలా..? వాటిని ఏం చేసుకుంటాం? :: అంతా నటించే వాళ్లే..! తూర్పు ఐరోపాలో నల్ల సముద్రం అంచున ‘ఉక్రెయిన్’ అని ఒక దేశం ఉంది. ఆ మధ్య ఆ దేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అతిరథ మహారథ వీర శూర దేశాధ్యక్షుడు పెత్రో పొరోషెంకో ను ప్రజలు చిత్తుగా ఓడించారు. టీ.వీ. హాస్య నటుడు (కమెడియన్) వొలొదిమీర్ జిలెనిష్కీ 73 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించాడు. ఇదేంటి? నేనే కమెడియన్ అనుకుంటే నన్ను మించిన కమెడి చేశారేంటి? ఈ జనం. అని, కావలసినంత విస్తు పోయి, బోలేడు బోలెడు ఆశ్చర్యపోయి, తనను తాను గిల్లి చూసుకొని, “కలయో వైష్ణవ మాయో..” అని, కాసేపు సందిగ్ధపడి, అంతలోనే తేరుకొని, నిజమేనని తెలుసుకొని, “నన్ను ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఏమాత్రం నిరాశ పరచను.” అని, దేశ ప్రజలకు జలవిష్కి దేశ ప్రజలకు తొలి సందేశాన్ని ఇచ్చాడు. నిజమైన హామీనే ఇచ్చాడు అతడు. సినిమాల్లో, టీ.వీ. సీరియల్ లో అతడు జనాన్ని ఏనాడు నిరాశ పరచలేదు. మన సార్లలా కాదు. చెప్పిందే చేస్తాడు. చెప్పనివీ చేసి చూపిస్తాడు. ఆసక్తి కలిగిన వారు ఆయన యూట్యూబ్లో చూసి తెలుసుకోవచ్చు. పదవిలోకి వచ్చాక కూడా నటిస్తారా? అని ఓ విలేకరి అడిగితే, చిరునవ్వుతో.. నటించనిది ఎవరు? చెప్పండి. నేను నటిస్తానని నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడట! పదవిలో నటిస్తాడో పదవిలో ఉండి (మన సీనియర్ ఎన్టియార్ గారి) లాగా సినిమాల్లో నటిస్తాడో సెలవియ్యలేదు. కానీ అంతా నటించే వాళ్లే అనే సత్యం మాత్రం చక్కగా చెప్పాడు. కలకాలం చల్లగా ఉండదగినవాడు సత్యాలు చెప్పేవారు ఎవరుంటారు? చెప్పండి. అలా చెప్పి జిలెనిష్కీలా గెలవగలరా? ఈ ప్రపంచాన్ని నానావిధ వంశాలు పరిపాలించాయి కదా! మన దేశాన్ని బానిస వంశస్థులు కూడా పరిపాలించారు. కానీ ఏ దేశాన్ని ఇప్పటిదాకా ఓ కమెడియన్ (హాస్య నటుడు) పరిపాలించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ తూర్పు ఐరోపాలో మాత్రం జిలెనిష్కీ రూపంలో ఆపొద్దు పొడిచిందనే చెప్పవచ్చు. :: కమెడియన్ రాజైతే ఆ మజాయే వేరు:: ఋషి కాని వాడు రాజు కాజాలడు అన్నారు పెద్దలు. ఆ భావన దేహం నిండా నిండి ఋషులు రాజులూ, రాజులు ఋషులూ , రాజ ఋషులూ, రుషి రాజులూ అవుతున్నారు. (రూపబభేదాలను పట్టించుకోవాల్సిన పనిలేదని ధర్మశాస్త్రం చెబుతుంది.) కానీ హాస్యగాళ్లూ, కమెడియన్లూ, జగ్లర్లూ రాజ్యం చేస్తే అదో అద్భుత లోకంలా విలసిల్లుతుందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలం. ఆ ఆలోచనే సుందరంగా ఆనందంగా అగుపిస్తుంది. “ఏమిస్తావంటే? నవ్విస్తానని చెబుతారుగా.. కనీసం! కామెడీ చేసిన, చేస్తున్న ప్రభువులు కోకొల్లలు. తాము చేసే కామెడీ సరిపోవట్లేదనుకుంటే బీర్బల్ లాంటి, తెనాలి రామకృష్ణుడు లాంటి కమెడియన్లను నియమించి, ఆనందింపజేసిన రారాజులకు కొదువే లేదు. అంతేగాని నేరుగా కమెడియన్ ప్రభువైపోతే ఆ మజాయే వేరప్ప! “పేరయ్య గారెల్లి రాజంటా పేరెల్లి సరసనా రాణంటా” అని పాడుకోవచ్చు. అంటాం గానీ మన దగ్గర మాత్రం హాస్య పాత్రలు లేని ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఉంటే కార్టూన్స్, హాస్య రచయితలు బతికి బట్టకట్టేవారా? వాళ్లు ఎవరినేది? స్థల కాలాలను బట్టి మీరే ఊహించుకోవాలి. ఒకప్పుడు రాజ్ నారాయణ్ (గుర్తున్నాడా జనతా పార్టీ), లాలు ప్రసాద్ యాదవ్ (గడ్డి కుంభకోణం) అలా పరంపర కొనసాగుతూనే ఉంది. లేకుంటే పాలన దేశం నిస్సారమైపోయేది. వేదనాభరితమైపోయేది. ఇక మన తెలుగు రాష్ట్రానికి వస్తే, టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి మీద ఎన్నో జోకులు వినపడేవి. వారి మాటలే హాస్యభరితంగా ఉండేవి. ఇప్పటికీ ప్రజల నాలుకల మీద వారి హాస్యక్తులు తొణకిస లాడుతూనే ఉంటాయి. :: కమెడియన్లు వర్ధిల్లాలి:: కామెడీ ప్రభుత్వం పై కామెడీ కథలు కూడా మన సాహిత్యంలో నిండా ఉన్నాయి. పరిపాలనలో హాస్యం తగ్గితే కష్టం. నవ్వులాట లేకపోతే వ్యవహారం సీరియస్ గా మారుతుంది. జనం సీరియస్ విషయాల గురించి సీరియల్ గానే అడుగుతారు. “మడిశన్నాక కూసింత కలాపోసణ ఉండాల” అన్నట్లు సర్కారులకు ఉండాలి. లేకుంటే కష్టమైపోతుంది. కమెడియన్లు ఉండాలి. ఇంత పెద్ద దేశం మనది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కనుక మరెంతోమంది కమెడియన్లు మన దగ్గర వర్ధిల్లాలి. ఒక ఉక్రెయిన్ లో మాత్రమే ఎందుక? అమెరికాలో ఎలాగూ (డోనాల్డ్ ట్రంప్) ఉన్నాడనుకోండి. కులాలకు, మతాలకు, మహిళలకు లెక్కలు వేసి మరీ ప్రాతినిథ్యం కల్పిస్తున్నట్లుగానే, మన దగ్గర కూడా కమెడియన్లకు తగిన ప్రాధాన్యతనివ్వాలి. అలా చేస్తే వారి గెలుపు గ్యారెంటీ..! మానిఫెస్టోలను సైతం కమెడియన్లతో రాయిస్తే మంచిది. ఇంతకన్నా హాస్య భరితంగా తయారుచేస్తే లక్ష కాపీలు గ్యారంటీగా అమ్ముడుపోతాయి. ఎవరి షోలు వాళ్లే ఏర్పాటు చేసుకొని బాగా రక్తి కట్టిస్తారు జనాలను లారీల్లో తోలుకొచ్చే పని ఉండదు. కమెడియన్ల షో అంటేనే జనాలు తండోపతండాలుగా విరగబడి వస్తారు. కాని సీరియస్ మొఖాలను ఎవరు చూస్తారు? జనం వచ్చాక కమెడియన్ షో ఎంత దాకా ఉంటుందో, అంతసేపే సభలో జనం కూర్చుంటారు. అంతేకాదు. గెలిచాక కమెడియన్స్ ఏమేం చేస్తారో జనానికి స్పష్టంగా తెలిసే ఉంటుంది. కనుక ఎంత ఆశ పెట్టుకోవాలో అంతే ఆశ పెట్టుకుంటారు. పదే పదే ఫిర్యాదులు ఉండవు. నిజమే కమీడియన్స్ తామెంత కష్టపడినా సరే తమ ప్రేక్షకులను మాత్రం నిరాశపరచరు. ఇది చాలదా! అందుకే కమెడియన్లు వర్ధిల్లాలంటాను. (“సాహిత్య కళా విభూషణ”స్వర్ణ నంది పురస్కార గ్రహీత చౌడూరి నరసింహారావు పత్రికారచయిత, సామాజిక విశ్లేషకులు)

హాస్య నటుడే రాజైతే..!

తెనాలి రామకృష్ణుడు, బీర్బల్, నస్రుద్దీన్, బస్టర్ కీటన్, ఎవరంటే ఠకీమని చెప్పగలం. కాని వారి వారి కాలంలోని ఏలికలు ఎవరంటే మాత్రం తలగోక్కోవాల్సిందే! “కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరీ..!” అని వేడుకోవాల్సి ఉంటుంది మరి. నువ్వు నాకు అదనంగా ఏమిస్తావు? నేను నిన్నే ఎందుకు? పెళ్లాడాలని అమ్మాయి అడిగితే, “నవ్విస్తానన్నాడట!” ఆ ప్రేమికుడు. అతన్ని ఆ అమ్మాయి పెళ్ళాడిందో లేదో తెలియదు గాని, జీవితాంతం నవ్వుతూ బతకగలిగితే అంతకన్నా ఎవరికైనా మరేం కావాలి? “నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును..” అంటాడు జాషువా ‘నవ్వుతూ బతకాలిరా! తమ్ముడూ నవ్వుతూ చావాలిరా! అని కోరుకోనిది ఎవరు? నవ్వితే కడుపు ఉబ్బుతుంది. ఒక్కొక్కసారి పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుతాం! నవ్వు విషయంలో ఇహ చాల్లే.. అనే మాట రాదు.. తలుచుకొని.. తలుచుకొని నవ్వుతాం! ఇది చాలదు? జీవితానికి మణులూ, మాన్యాలూ కావాలా..? వాటిని ఏం చేసుకుంటాం?

:: అంతా నటించే వాళ్లే..!
తూర్పు ఐరోపాలో నల్ల సముద్రం అంచున ‘ఉక్రెయిన్’ అని ఒక దేశం ఉంది. ఆ మధ్య ఆ దేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అతిరథ మహారథ వీర శూర దేశాధ్యక్షుడు పెత్రో పొరోషెంకో ను ప్రజలు చిత్తుగా ఓడించారు. టీ.వీ. హాస్య నటుడు (కమెడియన్) వొలొదిమీర్ జిలెనిష్కీ 73 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించాడు. ఇదేంటి? నేనే కమెడియన్ అనుకుంటే నన్ను మించిన కమెడి చేశారేంటి? ఈ జనం. అని, కావలసినంత విస్తు పోయి, బోలేడు బోలెడు ఆశ్చర్యపోయి, తనను తాను గిల్లి చూసుకొని, “కలయో వైష్ణవ మాయో..” అని, కాసేపు సందిగ్ధపడి, అంతలోనే తేరుకొని, నిజమేనని తెలుసుకొని, “నన్ను ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఏమాత్రం నిరాశ పరచను.” అని, దేశ ప్రజలకు జలవిష్కి దేశ ప్రజలకు తొలి సందేశాన్ని ఇచ్చాడు. నిజమైన హామీనే ఇచ్చాడు అతడు. సినిమాల్లో, టీ.వీ. సీరియల్ లో అతడు జనాన్ని ఏనాడు నిరాశ పరచలేదు. మన సార్లలా కాదు. చెప్పిందే చేస్తాడు. చెప్పనివీ చేసి చూపిస్తాడు. ఆసక్తి కలిగిన వారు ఆయన యూట్యూబ్లో చూసి తెలుసుకోవచ్చు. పదవిలోకి వచ్చాక కూడా నటిస్తారా? అని ఓ విలేకరి అడిగితే, చిరునవ్వుతో.. నటించనిది ఎవరు? చెప్పండి. నేను నటిస్తానని నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడట! పదవిలో నటిస్తాడో పదవిలో ఉండి (మన సీనియర్ ఎన్టియార్ గారి) లాగా సినిమాల్లో నటిస్తాడో సెలవియ్యలేదు. కానీ అంతా నటించే వాళ్లే అనే సత్యం మాత్రం చక్కగా చెప్పాడు. కలకాలం చల్లగా ఉండదగినవాడు సత్యాలు చెప్పేవారు ఎవరుంటారు? చెప్పండి. అలా చెప్పి జిలెనిష్కీలా గెలవగలరా? ఈ ప్రపంచాన్ని నానావిధ వంశాలు పరిపాలించాయి కదా! మన దేశాన్ని బానిస వంశస్థులు కూడా పరిపాలించారు. కానీ ఏ దేశాన్ని ఇప్పటిదాకా ఓ కమెడియన్ (హాస్య నటుడు) పరిపాలించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ తూర్పు ఐరోపాలో మాత్రం జిలెనిష్కీ రూపంలో ఆపొద్దు పొడిచిందనే చెప్పవచ్చు.

:: కమెడియన్ రాజైతే ఆ మజాయే వేరు::
ఋషి కాని వాడు రాజు కాజాలడు అన్నారు పెద్దలు. ఆ భావన దేహం నిండా నిండి ఋషులు రాజులూ, రాజులు ఋషులూ , రాజ ఋషులూ, రుషి రాజులూ అవుతున్నారు. (రూపబభేదాలను పట్టించుకోవాల్సిన పనిలేదని ధర్మశాస్త్రం చెబుతుంది.) కానీ హాస్యగాళ్లూ, కమెడియన్లూ, జగ్లర్లూ రాజ్యం చేస్తే అదో అద్భుత లోకంలా విలసిల్లుతుందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలం. ఆ ఆలోచనే సుందరంగా ఆనందంగా అగుపిస్తుంది. “ఏమిస్తావంటే? నవ్విస్తానని చెబుతారుగా.. కనీసం! కామెడీ చేసిన, చేస్తున్న ప్రభువులు కోకొల్లలు. తాము చేసే కామెడీ సరిపోవట్లేదనుకుంటే బీర్బల్ లాంటి, తెనాలి రామకృష్ణుడు లాంటి కమెడియన్లను నియమించి, ఆనందింపజేసిన రారాజులకు కొదువే లేదు. అంతేగాని నేరుగా కమెడియన్ ప్రభువైపోతే ఆ మజాయే వేరప్ప! “పేరయ్య గారెల్లి రాజంటా పేరెల్లి సరసనా రాణంటా” అని పాడుకోవచ్చు. అంటాం గానీ మన దగ్గర మాత్రం హాస్య పాత్రలు లేని ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఉంటే కార్టూన్స్, హాస్య రచయితలు బతికి బట్టకట్టేవారా? వాళ్లు ఎవరినేది? స్థల కాలాలను బట్టి మీరే ఊహించుకోవాలి. ఒకప్పుడు రాజ్ నారాయణ్ (గుర్తున్నాడా జనతా పార్టీ), లాలు ప్రసాద్ యాదవ్ (గడ్డి కుంభకోణం) అలా పరంపర కొనసాగుతూనే ఉంది. లేకుంటే పాలన దేశం నిస్సారమైపోయేది. వేదనాభరితమైపోయేది. ఇక మన తెలుగు రాష్ట్రానికి వస్తే, టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి మీద ఎన్నో జోకులు వినపడేవి. వారి మాటలే హాస్యభరితంగా ఉండేవి. ఇప్పటికీ ప్రజల నాలుకల మీద వారి హాస్యక్తులు తొణకిస లాడుతూనే ఉంటాయి.

:: కమెడియన్లు వర్ధిల్లాలి::
కామెడీ ప్రభుత్వం పై కామెడీ కథలు కూడా మన సాహిత్యంలో నిండా ఉన్నాయి. పరిపాలనలో హాస్యం తగ్గితే కష్టం. నవ్వులాట లేకపోతే వ్యవహారం సీరియస్ గా మారుతుంది. జనం సీరియస్ విషయాల గురించి సీరియల్ గానే అడుగుతారు. “మడిశన్నాక కూసింత కలాపోసణ ఉండాల” అన్నట్లు సర్కారులకు ఉండాలి. లేకుంటే కష్టమైపోతుంది. కమెడియన్లు ఉండాలి. ఇంత పెద్ద దేశం మనది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కనుక మరెంతోమంది కమెడియన్లు మన దగ్గర వర్ధిల్లాలి. ఒక ఉక్రెయిన్ లో మాత్రమే ఎందుక? అమెరికాలో ఎలాగూ (డోనాల్డ్ ట్రంప్) ఉన్నాడనుకోండి. కులాలకు, మతాలకు, మహిళలకు లెక్కలు వేసి మరీ ప్రాతినిథ్యం కల్పిస్తున్నట్లుగానే, మన దగ్గర కూడా కమెడియన్లకు తగిన ప్రాధాన్యతనివ్వాలి. అలా చేస్తే వారి గెలుపు గ్యారెంటీ..! మానిఫెస్టోలను సైతం కమెడియన్లతో రాయిస్తే మంచిది. ఇంతకన్నా హాస్య భరితంగా తయారుచేస్తే లక్ష కాపీలు గ్యారంటీగా అమ్ముడుపోతాయి. ఎవరి షోలు వాళ్లే ఏర్పాటు చేసుకొని బాగా రక్తి కట్టిస్తారు జనాలను లారీల్లో తోలుకొచ్చే పని ఉండదు. కమెడియన్ల షో అంటేనే జనాలు తండోపతండాలుగా విరగబడి వస్తారు. కాని సీరియస్ మొఖాలను ఎవరు చూస్తారు? జనం వచ్చాక కమెడియన్ షో ఎంత దాకా ఉంటుందో, అంతసేపే సభలో జనం కూర్చుంటారు. అంతేకాదు. గెలిచాక కమెడియన్స్ ఏమేం చేస్తారో జనానికి స్పష్టంగా తెలిసే ఉంటుంది. కనుక ఎంత ఆశ పెట్టుకోవాలో అంతే ఆశ పెట్టుకుంటారు. పదే పదే ఫిర్యాదులు ఉండవు. నిజమే కమీడియన్స్ తామెంత కష్టపడినా సరే తమ ప్రేక్షకులను మాత్రం నిరాశపరచరు. ఇది చాలదా! అందుకే కమెడియన్లు వర్ధిల్లాలంటాను.

(“సాహిత్య కళా విభూషణ”స్వర్ణ నంది పురస్కార గ్రహీత చౌడూరి నరసింహారావు పత్రికారచయిత, సామాజిక విశ్లేషకులు)

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

చదువు "కొంటున్నాం" చదువు "కొంటున్నాం"
చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..  న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..  అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం.....
ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది