కరాటేతో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది

వేములవాడ, జూన్ 11(భారత శక్తి) : కరాటేతో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం‌ పెంపొందుతాయని పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. బుధవారం మహదేవ్ ఫంక్షన్ హాల్ లో ఓకినవా సీనియర్ కరాటే మాస్టర్ అబ్దుల్ మన్నన్ సమ్మర్ క్యాంప్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు కరాటే గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పలు రకాల బెల్ట్స్ సాధించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ పట్టణ సిఐ బి.వీరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరాటేలో శిక్షణ పొందడం వల్ల ధ్యానం, యోగ, ప్రాణాయామం వంటి అంశాల్లో ప్రభావితమై సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని వివరించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు.కరాటేకి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులతో పాటు గత 35 సంవత్సరాల నుండి రాజన్న జిల్లాలో విద్యార్థిని విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయి,అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు మెడల్స్ అందిస్తున్నా మన్నాన్ సేవలు అభినందనీయమని కొనియాడి, మాస్టర్ మన్నాన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు మైలారం రాము మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల విద్యార్థిని,విద్యార్థినీలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని,అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.అలాగే పిల్లలకు ఉద్యోగాల్లో క్రీడా కోటలో రెండు శాతం రిజర్వేషన్ లభిస్తుందని తెలిపారు.ఈకార్యక్రమంలో కరాటే కోచ్లు లోలోపు రాజు, కనికరపు రాజశేఖర్, అనుగుల వర్షిత్, ప్రతాప రిషిక్ తేజ, గుడిసె సూర్య, జయచంద్ర పాల్గొన్నారు .

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

చదువు "కొంటున్నాం" చదువు "కొంటున్నాం"
చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..  న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..  అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం.....
ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

Related Posts