నేటి నుంచే వరల్డ్‌కప్‌ వామప్‌ మ్యాచ్‌లు

గువాహటి: భారత్‌లో వన్డే వరల్డ్‌కప్‌ సందడి ఆరంభమైంది. శుక్రవారం నుంచి అక్టోబరు 3 వరకు మెగా టోర్నీ సన్నాహకంగా ఆయా జట్లు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆ తర్వాత 5 నుంచి మెగా టోర్నీ ఆరంభమవుతుంది. ఈ వామప్‌ మ్యాచ్‌లకు గువాహటి, తిరువనంతపురం, హైదరాబాద్‌ వేదికలు కానున్నాయి. శుక్రవారం జరిగే తొలి వామప్‌ బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్ల మధ్య గువాహటిలో.. రెండో వామప్‌ దక్షిణాఫ్రికా-అఫ్ఘానిస్థాన్‌ల మధ్య తిరువనంతపురంలో.. మూడో వామప్‌ న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య హైదరాబాద్‌లో జరుగుతాయి. భారత జట్టు మాత్రం తమ తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను శనివారం ఇంగ్లండ్‌తో గువాహటిలో ఆడనుంది. మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2 గంటల నుంచే జరుగుతాయి. స్టార్‌గ్రూ్‌పలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఉప్పల్‌లో పాక్‌ Vs కివీస్‌ వన్డే వరల్డ్‌కప్‌ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియం ఆధునికంగా ముస్తాబైంది. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఈపాటికే మరమ్మతులు కూడా పూర్తి చేశారు. కొత్త సీటింగ్‌తో పాటు పైకప్పు నిర్మాణం కూడా పూర్తయ్యింది. మెగా టోర్నీలో భాగంగా ఇక్కడ మూడు ప్రధాన మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో పాక్‌ రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. అలాగే ఈ జట్టు రెండు వామప్‌ మ్యాచ్‌లు కూడా ఇక్కడే జరుగుతాయి. మొదట శుక్రవారం కివీస్‌తో, 3న ఆసీ్‌సతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడబోతోంది. 6న నెదర్లాండ్స్‌తో ఉప్పల్‌లోనే తమ వరల్డ్‌కప్‌ పోరును ఆరంభించనుంది.

నేటి నుంచే వరల్డ్‌కప్‌ వామప్‌ మ్యాచ్‌లు

గువాహటి: భారత్‌లో వన్డే వరల్డ్‌కప్‌ సందడి ఆరంభమైంది. శుక్రవారం నుంచి అక్టోబరు 3 వరకు మెగా టోర్నీ సన్నాహకంగా ఆయా జట్లు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆ తర్వాత 5 నుంచి మెగా టోర్నీ ఆరంభమవుతుంది. ఈ వామప్‌ మ్యాచ్‌లకు గువాహటి, తిరువనంతపురం, హైదరాబాద్‌ వేదికలు కానున్నాయి. శుక్రవారం జరిగే తొలి వామప్‌ బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్ల మధ్య గువాహటిలో.. రెండో వామప్‌ దక్షిణాఫ్రికా-అఫ్ఘానిస్థాన్‌ల మధ్య తిరువనంతపురంలో.. మూడో వామప్‌ న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య హైదరాబాద్‌లో జరుగుతాయి. భారత జట్టు మాత్రం తమ తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను శనివారం ఇంగ్లండ్‌తో గువాహటిలో ఆడనుంది. మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2 గంటల నుంచే జరుగుతాయి. స్టార్‌గ్రూ్‌పలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

ఉప్పల్‌లో పాక్‌ Vs కివీస్‌

వన్డే వరల్డ్‌కప్‌ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియం ఆధునికంగా ముస్తాబైంది. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఈపాటికే మరమ్మతులు కూడా పూర్తి చేశారు. కొత్త సీటింగ్‌తో పాటు పైకప్పు నిర్మాణం కూడా పూర్తయ్యింది. మెగా టోర్నీలో భాగంగా ఇక్కడ మూడు ప్రధాన మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో పాక్‌ రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. అలాగే ఈ జట్టు రెండు వామప్‌ మ్యాచ్‌లు కూడా ఇక్కడే జరుగుతాయి. మొదట శుక్రవారం కివీస్‌తో, 3న ఆసీ్‌సతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడబోతోంది. 6న నెదర్లాండ్స్‌తో ఉప్పల్‌లోనే తమ వరల్డ్‌కప్‌ పోరును ఆరంభించనుంది.

About The Author

Related Posts