మల్లారెడ్డిపల్లి లో ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు

రూ.50 వేలు విరాళం అందజేసిన సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి

మల్లారెడ్డిపల్లి లో ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు.శుక్రవారం హోమం, జలాధివాసం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి మాట్లాడుతూ అందరికీ హనుమాన్ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, హనుమాన్ ఆలయ నిర్మాణానికి స్వామివారి పునః ప్రతిష్ట మహోత్సవానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రజలు సహకరించాలని కోరుతూ రాబోయే రోజుల్లో గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలను, అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు, ముఖ్యంగా యువత దైవభక్తి సేవా గుణం కలిగి ఉండాలని అన్నారు, ఆదివారం స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.అనంతరం పురోహితులు రాయవరం రవీంద్ర శర్మ, గురుస్వామి అంజా గౌడ్, మాట్లాడుతూ హనుమాన్ దేవాలయం నిర్మాణం, స్వామివారి పునః ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, గ్రామ సర్పంచ్  యాబై వేల రూపాయలు విరాళం అందజేశారని అలాగే గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి, ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే చాలామంది ఆలయ నిర్మాణానికి, స్వామి వారి ప్రతిష్ఠ మహోత్సవానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్వామివారి కరుణాకటాక్షాలు ఉంటాయని తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-10 at 19.38.28

About The Author