నమిశ్రీ 'అరియా'లో ఫ్లాటు, కొంటే మునిగిపోవాల్సిందే..!
- నమిశ్రీ 'అరియా'లో అక్రమాల 'మాయా'.. వెయ్యి కోట్ల అటవీభూమి కబ్జా!
- అనుమతులు సర్వే నెం. 121లో.. అక్రమ నిర్మాణాలు ఫారెస్ట్ ల్యాండ్‌లో!
- ఎల్బీనగర్ జోన్ నాగోల్ సర్కిల్ మున్సిపల్ అధికారుల చర్యలు ఎక్కడ..!
- హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారుల అండతోనే రియల్ మాఫియా పంజా? సామాన్యుల సొమ్ముకు భద్రత ఏది?
- సరూర్నగర్ సబ్ రిజిస్టర్ , స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నత అధికారులు దృష్టి సారించి రిజిస్ట్రేషన్లు ఆపాలి..!
- భవిష్యత్తులో హైడ్రా లాంటి సంస్థ ఈ భారీ నిర్మాణాన్ని కూల్చివేస్తే నివాసం ఉంటున్న అమాయకులు ఎక్కడికి వెళ్లాలి..!
- పూర్తి ఆధారాలు పెట్టి వ్రాతపూర్వక ఫిర్యాదు చేసి .. వార్తలు వ్రాస్తున్నా..మల్కాజ్గిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ చర్యలు ఎక్కడ..!
నాగోల్ బండ్లగూడలో జరుగుతున్న అవినీతి తంతును ఆపే వారే లేరా..! - మున్సిపల్ శాఖ సెక్రెటరీ జయేష్ రంజన్, సీ.ఎం రేవంత్ రెడ్డి, దృష్టి సారించి ఈ అవినీతితంగాన్ని ఆపాలంటూ: స్థానిక ప్రజల డిమాండ్..!
రాష్ట్రంలో పాలన మారినా, రియల్ మాఫియా తీరు మారలేదనడానికి నాగోల్ ‘నమిశ్రీ అరియా’ వ్యవహారమే నిదర్శనం. అటవీ భూములను మింగేస్తూ ఆకాశహర్మ్యాలు లేస్తుంటే, నిఘా పెట్టాల్సిన హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ‘ముడుపుల’ మత్తు ఎంత ఉందో అర్థమవుతోంది. ఫోర్జరీ కేసులున్నా నిర్మాణాలు ఆగకపోవడం ప్రభుత్వ రిట్ పిటిషన్లకే సవాలుగా మారింది. హైడ్రా వంటి సంస్థలు ఒకవైపు అక్రమాలను కూలుస్తుంటే, మరోవైపు అధికారుల అండతోనే కొత్త అక్రమాలు పుట్టుకురావడం సిగ్గుచేటు. సామాన్యుడి సొమ్మును రిస్క్‌లో పెడుతూ, పర్యావరణాన్ని చెరబడుతున్న ఈ ‘రియల్’ దందాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే, అది వ్యవస్థాగత వైఫల్యమే అవుతుంది. కంచె చేను మేసిన చందంగా మారిన అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి తక్షణమే ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది..jpeg)
హైదరాబాద్:
రాజధాని నగరంలో రియల్ ఎస్టేట్ మాఫియా ఆకలికి హద్దు అదుపు లేకుండా పోతోంది. సామాన్యుడి సొంతింటి కలను ఆసరాగా చేసుకుని, ప్రభుత్వ ఆస్తులను మింగేస్తూ, చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. నాగోల్ బండ్లగూడ పరిధిలోని తట్టి అన్నారంలో *'నమిశ్రీ అరియా'* ప్రాజెక్ట్ పేరుతో సాగుతున్న వేల కోట్ల అవినీతి బాగోతం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అటవీ భూములను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు 'రెడ్ కార్పెట్' పరుస్తున్న వైనంపై 'వార్తా వెలుగు' అందిస్తున్న ప్రత్యేక పరిశోధనాత్మక కథనం.
నమిశ్రీ సంస్థ అరియా ప్రాజెక్ట్ కోసం సర్వే నంబర్ 121లో అనుమతులు పొందింది. కాగితాల్లో చూపించిన భూమి కేవలం 2 ఎకరాల 35 గుంటలే. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న దందా వేరు. పక్కనే ఉన్న *సర్వే నంబర్ 117/6 (అటవీ భూమి)* కు సంబంధించిన 4 ఎకరాలను, అలాగే సర్వే నంబర్ 122లోని మరో 2 ఎకరాలను కలుపుకుని ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు.
RERA నంబర్: 02400061375
నిబంధనల ప్రకారం రెవెన్యూ స్కెచ్, NOCలు లేకుండా అనుమతులు రావు. మరి అటవీ భూమిని కలుపుకుని ప్లాన్ గీస్తే.. హెచ్‌ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్లు మూసుకున్నారా? లేక ముడుపుల మత్తులో సంతకాలు పెట్టారా?
కంచె చేను మేస్తే కాపాడేదెవరు?*
అటవీ భూమి కబ్జాకు గురవుతుంటే గండ్రగొడ్డలి పట్టాల్సిన ఫారెస్ట్ అధికారులు మౌన ముద్రలో ఉండటం వెనుక మర్మమేమిటి?
1. *క్రిమినల్ కేసులున్నా ఆగని పనులు:* ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో సి. అమరేందర్ రెడ్డి, పి. ధర్మవీర్ రెడ్డిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనా నిర్మాణాలు ఆగకపోవడం చూస్తుంటే అధికారుల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.
2. పట్టించుకోని అధికార గణం:* ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఏడాది క్రితమే ఫిర్యాదు చేసినా.. నాగోల్ సర్కిల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్ వంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వీరి మౌనం వెనుక ఉన్న 'ముడుపుల' బాగోతంపై ఏసీబీ (ACB) విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
చట్టం ఏం చెప్తోంది? (అటవీ భూమి ఆక్రమణ - కఠిన శిక్షలు)
అటవీ చట్టం (Forest Conservation Act) ప్రకారం ప్రభుత్వ భూమిని ఆక్రమించడం శిక్షార్హమైన నేరం:
* *సెక్షన్ 20 & 26:* రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమిస్తే కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.
అధికారులపై చర్యలు: ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా స్పందించని అధికారులపై 'డ్యూటీ పట్ల నిర్లక్ష్యం' (Dereliction of Duty) కింద సర్వీసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అవినీతి నిరూపితమైతే ఏసీబీ కేసులు తప్పవు..jpeg)
మధ్యతరగతి ప్రజలారా.. తస్మాత్ జాగ్రత్త!
అక్రమ లేఅవుట్లు, కబ్జా భూముల్లో కట్టే భవనాల్లో ప్లాట్లు కొంటే రేపు ఆ అనుమతులు రద్దు అయితే మధ్యతరగతి జనం వీధిన పడటం ఖాయం. ఇప్పటికే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కానీ రేపు కోర్టులు కూల్చివేతలకు ఆదేశిస్తే కస్టమర్ల కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
> డిమాండ్: మల్కాజ్గిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ అక్రమ ప్రాజెక్టుపై దృష్టి సారించాలి. తక్షణమే 'నమిశ్రీ అరియా' రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలి. అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి, అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలి. అవినీతి అధికారుల భరతం పట్టాలి.
నమిశ్రీ అంటేనే మోసం..! హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ప్రభుత్వ స్థలంలో ఉన్న ప్రముఖ ట్రస్ట్ హాస్పిటల్ ని అక్రమ పద్ధతిలో చేజిక్కించుకున్నదెవరు.. ఒక్కొక్కటిగా పూర్తి ఆధారాలతో తదుపరి కథనంలో...
.jpeg)
