ట్రాఫిక్ అంతరాయం లేకుండా డివైడర్ వెడల్పు తగ్గించండి...
ట్రాఫిక్ అధికారులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశం
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గం చింతల్ కుంట బస్ స్టాప్ వద్ద ఉన్న డివైడర్ వెడల్పు తగ్గింపు కోసం ట్రాఫిక్ అధికారులతో కలిసి పరిశీలించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో పైలెట్ ప్రాజెక్టు కింద చింతల్ కుంట వద్ద డివైడర్ ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ డివైడర్ దాదాపు పది నుంచి పన్నెండు ఫీట్లు వెడల్పుగా నిర్మించడం వల్ల పలు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో డివైడర్ వెడల్పు తగ్గించాలని సుధీర్ రెడ్డి అధికారులకు సూచించారు.ఈ డివైడర్ వెడల్పు తగ్గించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు.అలాగే సర్వీస్ రోడ్డు వెడల్పు పెరిగితే కూడా సాఫీగా ప్రయాణం చేయడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ, ఎంత మేర డివైడర్ తగ్గించాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి అనుకూలంగా డివైడర్ వెడల్పు తగ్గిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ.వెంకటేశ్వర్లు, జక్కిడి రఘువీర్ రెడ్డి, రవి ముదిరాజ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
