సంపూర్ణ పౌష్టికాహారంతోనే స్త్రీ ఆరోగ్య వికాసం

దుబ్బాక ఐసిడిఎస్ ఇంచార్జ్ సిడిపిఓ చంద్రకళ

సంపూర్ణ పౌష్టికాహారంతోనే స్త్రీ ఆరోగ్య వికాసం

సిద్దిపేట:

 సంపూర్ణ పౌష్టికాహారంతోనే స్త్రీ, శిషు, చిన్నారుల ఆరోగ్య వికాసం ఉంటుందని దుబ్బాక ఐసీడీఎస్ ఇంచార్జి సీడీపీఓ చంద్రకళ తెలిపారు.సిద్దిపేట జిల్లా తొగుట 
మండలంలోని వెంకట్రావుపేటలో గ్రామ స్థాయి పోషణ పక్షం కార్యక్రమంలో సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఏప్రిల్ 9 నుండి 23 వరకు జరుగుతున్న పోషణ పక్షం షెడ్యూల్‌లో భాగంగా  గ్రామంలోని మొదటి అంగన్వాడీ కేంద్రంలో గ్రామ స్థాయి పోషణ పక్షం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సమతుల ఆహారం అవసరం, రోజువారీ జీవన విధానంలో పోషకాహారం పాత్ర గురించి వివరించారు. అదేవిధంగా, వంటకాల ప్రదర్శనలు నిర్వహించి, సులభంగా లభ్యమయ్యే పదార్థాలతో ఆరోగ్యకరమైన ఆహారం తయారీ విధానాలను చూపించారు. ముఖ్యంగా, గర్భం దాల్చిన రోజు నుండి బిడ్డ పుట్టిన తర్వాత రెండేళ్ల వరకు ఉన్న మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతపై స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ దశలో తల్లి, శిశువుకు సరైన పోషణ ఎంతో కీలకమని వివరించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అందించే అదనపు సంపూర్ణ భోజనాన్ని ప్రతి అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన కార్యక్రమాలు నిర్వహించారు.చివరగా, అందరూ కలిసి పోషణ ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో  డాక్టర్ సుభాషిణి, పంచాయతీ సెక్రెటరీ రవీందర్,  పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్యాంసన్, రిలయన్స్ కోఆర్డినేటర్ భాస్కర్, సెక్టార్ సూపర్వైజర్ ప్రతిభ, ఏఎన్‌ఎం లక్ష్మి, వార్డు సభ్యులు శ్యామల,  భాను, శ్రీనివాస్, లలిత, జహంగీర్, వెంకటేశం, అంగన్వాడీ టీచర్లు వీణ, స్వప్న, జ్యోతి, ఆశ కార్యకర్తలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-13 at 19.22.01 (1)

About The Author