శ్రీ భారతి విద్యాలయంలో ఘనంగా రోబోటిక్ ప్రదర్శన

  • ఆకట్టుకున్న హ్యూమనాయిడ్ రోబో, రోబోటిక్ డాగ్*
  • ఏఐ సాంకేతికతపై విద్యార్థుల పట్టు*
  • ముఖ్య అతిథులుగా డీఆర్‌డీఓ సైంటిస్ట్, ఎస్సార్ వర్సిటీ ప్రొఫెసర్*

శ్రీ భారతి విద్యాలయంలో ఘనంగా రోబోటిక్ ప్రదర్శన

హైదరాబాద్:

 తరగతి గది పాఠాలకే పరిమితం కాకుండా.. భావి తరానికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులు పట్టు సాధిస్తున్నారు. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్ రంగాల్లో తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని శ్రీ భారతి విద్యాలయంలో నిర్వహించిన 'రోబోటిక్ ప్రదర్శన' విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది.

 అబ్బురపరిచిన ప్రాజెక్టులు
అర్థాబోట్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు రూపొందించిన దాదాపు 50 ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా మనుషుల మాదిరిగానే స్పందించే 'హ్యూమనాయిడ్ రోబో', వింత విన్యాసాలు చేసే 'రోబోటిక్ డాగ్' సందర్శకులను అబ్బురపరిచాయి. అంధులకు దారి చూపే 'స్మార్ట్ స్టిక్', ప్రమాదాల సమయంలో ప్రాణాలు కాపాడే 'ఫైర్ ఫైటింగ్ రోబో', భవిష్యత్తు రవాణాకు కీలకంగా మారనున్న 'ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్' వంటి ప్రయోగాలు విద్యార్థుల మేధస్సుకు నిదర్శనంగా నిలిచాయి. 3D ప్రింటింగ్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీపై వారు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.WhatsApp Image 2026-04-11 at 18.16.04

సాంకేతికతతోనే ఉజ్వల భవిష్యత్తు:
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డీఆర్‌డీఓ (DRDO) సైంటిస్ట్ డాక్టర్ కె. శ్రీనివాసరావు, ఎస్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే ఇలాంటి సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవడం వల్ల విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కోగలరని తెలిపారు. సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ కె. శరత్ కుమార్ విద్యార్థుల కృషని అభినందించారు.

 ఏఐ విద్యే లక్ష్యం..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో కూడిన ఆధునిక విద్యను అందిస్తామని స్కూల్ చైర్మన్ జయరామ్, ప్రిన్సిపల్ సరిత పేర్కొన్నారు. కొత్త కొత్త ప్రాజెక్టుల ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట సాయి రోహిత్, డాక్టర్ ఫణి కుమార్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.WhatsApp Image 2026-04-11 at 18.16.06WhatsApp Image 2026-04-11 at 18.16.05

About The Author