పోషణ పక్వాడ్‌లో భాగంగా చిట్టాపూర్‌లో కార్యక్రమం
సిద్దిపేట:
దుబ్బాక ప్రాజెక్ట్ తిమ్మాపూర్ సెక్టార్ పరిధిలోని చిట్టాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా లభించే ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో వంటకాల ప్రదర్శనతో పాటు గర్భవతులు, తల్లుల కోసం వంటల పోటీలు నిర్వహించారు.
ప్రతి వంటకంలో ఉపయోగించిన పదార్థాల పోషక విలువలను వివరించి, సమతుల ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వర్షిత దయాకర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వరూప, వార్డు సభ్యులు, ర్యాకం అనంత్, గాజుల శ్వేత, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వసంత్ నాయక్, భాగ్యలక్ష్మి, ఏఎన్‌ఎం, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, జయమ్మ, ఆశా కార్యకర్తలు, వీవో లీడర్లు, గర్భవతులు, తల్లులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.
About The Author
13 May 2026
