నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక లక్ష 90 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ

నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి

పటాన్‌చెరు:

ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారం డివిజన్ పరిధిలోని బీరప్ప బస్తీకి చెందిన కాజిం ఖాన్, బీరంగూడ డివిజన్ పరిధిలోని వందన పురి కాలనీకి చెందిన బండ ప్రభాకర్ లు మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి మంజూరైన ఒక లక్ష 90 వేల రూపాయల విలువైన ఎల్ఓసి పత్రాలను సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

About The Author