మహనీయుల ఆశయాలే మనకు మార్గదర్శకం
అంబేద్కర్ జయంతి సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ఘన నివాళులు..
ఎల్బీనగర్:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, సూర్యచంద్రులు ఉన్నంతకాలం మహనీయుల్ని కొనియాడుతామని అట్టి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే మన జన్మ సార్థకం అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్ మాసం వచ్చిందంటే మహనీయుల జ్ఞాపకాలు మన మనసుల్లో మళ్లీ మళ్లీ తళుక్కుమంటాయని ఆమె కొనియాడారు.అదేవిధంగా, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో నిర్మించిన బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహాన్ని రెండు సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇకనైనా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ విగ్రహాన్ని ప్రజల దర్శనార్థం అందుబాటులోకి తీసుకురావాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
