ప్రపంచ రికార్డులతో మెరిసిన లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ
ఎల్బీనగర్:
కొత్తపేట ఓక్‌వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో జరిగిన బ్లాక్ బెల్ట్ అవార్డు వేడుకలో విద్యార్థుల అద్భుత ప్రతిభ – గిన్నిస్ & లిమ్కా రికార్డ్స్ సాక్షిగా ఘన విజయోత్సవం.మార్షల్ ఆర్ట్స్ రంగంలో మరో మైలురాయిని నమోదు చేస్తూ, లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ వార్షిక బ్లాక్ బెల్ట్ అవార్డు ప్రదానోత్సవం, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమం అత్యంత ఘనంగా విజయవంతమైంది.ఈ వేడుకలో పాల్గొన్న విద్యార్థులందరూ లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్న వారే కావడం విశేషం. వారు ప్రదర్శించిన కరాటే నైపుణ్యాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ముఖ్యంగా తల్హా మరియు అయాన్ అలీ వారి ప్రతిభ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అందరి ప్రశంసలను అందుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ హాజరై కార్యక్రమానికి మరింత ప్రతిష్టను తీసుకువచ్చారు. అలాగే ప్రముఖ స్టంట్ మాస్టర్స్ బద్రి (డేర్ డెవిల్), కృష్ణ స్టంట్ మాస్టర్, మూవీ ఎడిటర్ సంపత్ ప్రకాశ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్: కే. మహేష్ నాయక్, ఫౌండర్ & ప్రెసిడెంట్ – ఇండియా స్టైల్ చీఫ్. అలాగే
చైర్మన్ డా. లయన్ గోపాల్ రెడ్డి ఓక్‌వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ సీనియర్ మాస్టర్ పీఎం రాము,మాస్టర్స్ సిహెచ్ రాజ్ కుమార్, ఎస్ ప్రసాద్ వెంకటేష్, ఆర్ మహేష్, నందిని, శ్రీకాంత్, శివ కృషి కార్యక్రమ విజయానికి బలమైన ఆధారంగా నిలిచింది.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు, కరాటే క్రీడ ప్రాముఖ్యతను సమాజానికి చాటింది. ప్రపంచ రికార్డులను సాక్షిగా చేసుకున్న ఈ వేడుక సంస్థకు మరింత గౌరవాన్ని తీసుకువచ్చింది.
చివరగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అతిథులు, తల్లిదండ్రులు, సభ్యులందరికీ లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
గిన్నిస్ & లిమ్కా రికార్డ్స్ వేడుకలో మీసాల జతీష్ అద్భుత ప్రతిభ..

