హనుమాన్ దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి

హనుమాన్ దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

సిద్దిపేట:

హనుమాన్ దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో  శ్రీ హనుమాన్ స్వామి, నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరితో కలిసి పాల్గొని 
మాట్లాడారు.హనుమాన్ దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలోని పురాతన హనుమాన్ ఆలయం పునర్నిర్మాణం, స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గత నాలుగు రోజులుగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు కన్నుల పండుగగా  గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని, స్వామివారి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు, పురోహితులు రవీంద్ర శర్మ,గురుస్వామి అంజా గౌడ్, దాతలు, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-12 at 19.49.33

About The Author