నగరంపై ‘డ్రోన్‌’ ఆంక్షలు.. నేడు నో ఫ్లై జోన్‌గా బేగంపేట పరిసరాలు

  • ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భద్రతా బలగాల పహారా..
  •  నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నగరంపై ‘డ్రోన్‌’ ఆంక్షలు.. నేడు నో ఫ్లై జోన్‌గా బేగంపేట పరిసరాలు

మల్కాజ్గిరి:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన దృష్ట్యా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మల్కాజ్‌గిరి కమిషనరేట్ పోలీసులు తెలిపారు. ఈ నెల 10వ తేదీన బేగంపేట పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని హాజరుకానున్న నేపథ్యంలో.. సభా ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాలను 'నో ఫ్లై జోన్'గా ప్రకటిస్తూ డీసీపీ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు.

 24 గంటల పాటు ఆంక్షలు
ప్రధాని పర్యటనను పురస్కరించుకుని భద్రతా కారణాల దృష్ట్యా సెక్షన్ 163 (BNSS) కింద నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి.

 సమయం: ఆదివారం అర్ధరాత్రి 00:00 గంటల నుండి రాత్రి 24:00 గంటల వరకు (24 గంటల పాటు).
 వ్యాప్తి: బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆంక్షలు వర్తిస్తాయి.

నిషేధిత పరికరాల జాబితా
గాలిలో ఎగిరే ఎలాంటి పరికరానికైనా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా:

 * అన్ని రకాల రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు*.
 పారా-గ్లైడర్లు*, పారా మోటార్లు.
 * రిమోట్ కంట్రోల్డ్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
 "ప్రధాని పర్యటన నేపథ్యంలో గాలిలో డ్రోన్లు ఎగురవేయడం చట్టరీత్యా నేరం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ప్రజలు, డ్రోన్ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి."
మల్కాజ్‌గిరి డీసీపీ

సభ జరిగే ప్రాంతంలో ఇప్పటికే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశాయి. ప్రతి ఒక్కరికీ విడివిడిగా నోటీసులు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, పత్రికా ప్రకటన ద్వారానే ఈ సమాచారాన్ని బహిరంగ పరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

About The Author