బండి సంజయ్ కుమార్ ను వెంటనే కేంద్ర మంత్రి వర్గం నుండి తొలగించాలి.. బిఆర్ఎస్ నాయకుల డిమాండ్
ఎల్బీనగర్:
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ను వెంటనే కేంద్ర మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, ఆర్కే పురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ లు డిమాండ్ చేశారు. సోమవారం భారాస డివిజన్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు సాయి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తుంటే వాస్తవాలు కప్పిపుచ్చడానికి మంత్రి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. మైనర్ బాలికను మోసం చేసిన సంజయ్ కుమారుడు భగీరథ్ పైన కేసులు నమోదు చేయాలని కేంద్ర మంత్రి పదవి నుండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలని ప్రధానిని కోరారు. చట్టం అనేది డబ్బులున్న వారికీ చుట్టమా అని ప్రశ్నించారు.విషయ పరిజ్ఞానం లేకుండా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్ సర్కార్ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం విడ్డూరమన్నారు. భగీరథ్ పై పోక్సో కేసు కాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ బాధితురాలికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నరేంద్రమోడీ సభలో దేవుడిని, కులాన్ని అడ్డం పెట్టుకుని పోతున్నామని బండి సంజయ్ మాట్లాడడం వారి నైజం బయటపడిందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును
ముందుకెళ్లకుండా బండి సంజయ్ ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపనీయమన్నారు. బాలిక తల్లిదండ్రులు గత మూడు నెలల క్రితం కేసు పెడతానని అంటే పెట్టనీయకుండా అడ్డుకుని
కాంగ్రెస్, బిజెపి లోపయకారి ఒప్పందానికి నిదర్శనమన్నారు. బాలిక తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఈవిషయంపై మాట్లాడకపోవం విస్మయం కలిగిస్తుందన్నారు. రాష్ట్ర
పోలీసు శాఖకు స్వేచ్ఛ ఇవ్వాలని అప్పుడే బాధితురాలికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దగోని వెంకటేష్ నాయకులు గొడుగు శ్రీనివాస్, రామాచారి, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, శేఖర్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
