నాగోల్ సర్కిల్లో టౌన్ ప్లానింగ్ అక్రమాలు: పన్నుల చౌర్యం-

  • అనుమతి రెసిడెన్షియల్.. నిర్మాణం కమర్షియల్ కాంప్లెక్స్ ,నాగోల్ హైవేపై యథేచ్ఛగా అక్రమ కట్టడాలు!
  • నోటీసులు ఇచ్చి ముడుపులు అందుకుని చేతులు దులుపుకుంటున్న సిబ్బంది..!
  • మున్సిపల్ ఖజానాకు భారీ గండి.. నిబంధనలు గాలికి వదిలేసిన అధికారులు
  • *ఫైర్ సేఫ్టీ సున్నా - ప్రాణాపాయ స్థితిలో స్థానికులు
  • ఈ అక్రమ నిర్మాణ అనుమతులు క్యాన్సల్ చేసి బిల్డింగ్ సీజ్ చేయాలి :స్థానికుల డిమాండ్..!
  • మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హైడ్రా రంగనాథ్ మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..

నాగోల్ సర్కిల్లో టౌన్ ప్లానింగ్ అక్రమాలు: పన్నుల చౌర్యం-

ఎల్బీనగర్:

ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతోందా? లేక అక్రమ కట్టడాల వెనుక ఉన్న 'ముడుపుల' మత్తులో ఉందా? నాగోల్-ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై వెలుస్తున్న ఓ భారీ కమర్షియల్ కాంప్లెక్స్ ఉదంతం చూస్తుంటే అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న తీరు స్పష్టంగా అర్థమవుతోంది. నివాస అవసరాల కోసం అనుమతులు పొంది, నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ సముదాయాలు నిర్మించడమే కాక, అదనపు అంతస్తులతో భద్రతను పణంగా పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.WhatsApp Image 2026-05-10 at 15.24.52

నిబంధనల ఉల్లంఘన - పన్ను ఎగవేత
అక్రమ నిర్మాణం యొక్క వివరాలు:
సాయి నగర్ కాలనీలోని ప్లాట్ నంబర్ 7లో నిర్మించిన ఈ భవనం (అనుమతి సంఖ్య: 4041/GHMC/LBN/2022-BP), అధికారుల కళ్లు గప్పి మున్సిపల్ ఖజానాకు లక్షల్లో పన్ను ఎగవేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
 
గృహ నిర్మాణం పేరుతో వ్యాపారం:* 2022లో ఐదు అంతస్తుల గృహ నిర్మాణానికి అనుమతి పొంది, అక్కడ పూర్తిస్థాయి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ బజాజ్ షోరూంలు, మసాజ్ పార్లర్లు నిర్వహిస్తున్నారు.

 అక్రమ సెల్లార్: అనుమతి లేకుండానే సెల్లార్ నిర్మాణం చేపట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (Occupancy Certificate) జారీ చేయడం గమనార్హం.

 మరో అంతస్తుపై 'ఐరన్' పంజా: 
తాజాగా అనుమతి లేని ఆరవ అంతస్తును ఐరన్ రేకులతో నిర్మిస్తున్నారు. ఇది అగ్ని ప్రమాదాలకు పొంచి ఉన్న ముప్పుగా స్థానికులు పేర్కొంటున్నారు.

గల్లీలో లిఫ్ట్.. ఫైర్ సేఫ్టీకి పాతర!

అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజన్లు వెళ్లడానికి కనీస స్థలం (Side Open Space) లేకుండా, సైడ్ గల్లీని పూర్తిగా మూసేసి అక్రమంగా లిఫ్ట్ నిర్మాణం చేపట్టడం అత్యంత ప్రమాదకరం. ఫైర్ సేఫ్టీ నిబంధనలను బేఖాతరు చేస్తూ చేపట్టిన ఈ నిర్మాణం రేపు ఏదైనా విపత్తు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అధికారుల అలసత్వం - క్రిమినల్ చర్యలకు డిమాండ్
ఈ అక్రమాలపై పది రోజుల క్రితమే స్థానికులు వ్రాతపూర్వక ఫిర్యాదు చేసినా అధికారుల స్పందన శూన్యం. మల్కాజ్గిరి సర్కిల్-11 అధికారులు కేవలం నోటీసులకే పరిమితమై, క్షేత్రస్థాయిలో అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.WhatsApp Image 2026-05-10 at 15.42.58

నేరారోపణలు:*
1. మున్సిపాలిటీని మోసం చేసినందుకు *IPC సెక్షన్ 420 (చీటింగ్)* కింద యజమానిపై కేసు నమోదు చేయాలి.

 2. నిబంధనల ఉల్లంఘనను ప్రోత్సహించిన అధికారులపై అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలి.

'హైడ్రా' దృష్టి సారిస్తుందా?
"అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం.. అధికారులపైనా చర్యలు తీసుకుంటాం" అని చెబుతున్న *హైడ్రా (HYDRAA)* యంత్రాంగం ఈ భారీ అక్రమ కట్టడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. తక్షణమే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను రద్దు చేసి, బిల్డింగ్‌ను సీజ్ చేయాలని, మున్సిపల్ ఖజానాకు గండి కొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే తరహాలో గృహ నిర్మాణ అనుమతులతో కమర్షియల్ నిర్మాణం చింతలకుంట విజయవాడ హైవే విశాల్ మార్ట్, కల్ట్ ఫిట్ జిమ్ ,బిల్డింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ .
అధికారులు దృష్టి సారించాలి..!WhatsApp Image 2026-05-10 at 15.42.21

About The Author