బీసీ వాదాన్ని బలోపేతం

  • చేస్తున్న బీసీ ప్రభంజనం సభ
  • ఒకవైపు బీసీ నేతలకు ఆహ్వానం మరోవైపు బీసీ సమగ్ర కులాలతో సమన్వయం

బీసీ వాదాన్ని బలోపేతం

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ లో జరగనున్న బీసీ ప్రభంజనం సభకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ బీసీ సంఘాల నాయకులు కెవి గౌడ్, ఉపేంద్ర యాదవ్, రాయబండి పాండు రంగాచారి, జాల కిషన్ లు తెలిపారు. మే 24 న ఎల్బీనగర్ ఎస్ కే గార్డెన్ లో జరిగే బీసీ ప్రభంజనం సభకు రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాల అగ్ర నాయకులు, మేధావులు హాజరు కానున్నారని బీసీ సంఘాల నాయకులు వివరించారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇంచార్జి మధుయాష్కీ గౌడ్ లను బీసీ ప్రభంజనం నాయకులు కలిసారు. సోమవారం బీసీ ఇంటలెక్షవల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవిలును కలిసిన బీసీ సంఘాల నేతలు బీసీ ప్రభంజనం సభకు రావాలని కోరారు. అదే విధంగా సీనియర్ జర్నలిస్టు, పాశం యాదగిరిని కలిసిన బీసీ ప్రభంజనం నాయకులు బీసీ ఉద్యమానికి మద్దతుగా రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ బీసీ నేతలకు వివరిస్తున్నారు.‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వి. హనుమంతురావును కలవడం జరిగిందని బీసీ ప్రభంజనం సమన్వయకర్త టియుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు జాల కిషన్ తెలిపారు. మే 24 న ఎల్బీనగర్ లో జరిగే బీసీ ప్రభంజనం సభ విజయవంతం చేయడానికి బీసీలు అందరూ ఒక్క తాటి పైకి రావాలని బీసీ సంఘాల నాయకులు కెవి గౌడ్, ఉపేంద్ర యాదవ్, రాయబండి పాండు రంగాచారి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు అందరూ ఐక్యత చాటాలని ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ కన్వీనర్ తెలంగాణ వెంకన్న విజ్ఞప్తి చేశారు. బీసీ ప్రభంజనం సభకు దళిత గిరిజన బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారని ఆయన వివరించారు.

About The Author